• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అధిష్టాం ఎలా చెబితే అలా నడుచుకుంటా: చిరంజీవి

By Srinivas
|
Chiranjeevi
హైదరాబాద్: అధిష్టానం ఎలా చెబితే తాను అలా నడుచుకుంటానని తిరుపతి శానసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి సోమవారం చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిరంజీవి రాజ్యసభ అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తనను ఖరారు చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని చెప్పారు. చిరంజీవి నేతలకు అల్పాహార విందు ఇచ్చారు. మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. మరో నేత వంగా గీత మాట్లాడుతూ... చిరంజీవికి రాజ్యసభను కేటాయించినందుకు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు అని చెప్పారు. చిరంజీవి రాజ్యసభకు వెళితే ఖాళీ అయ్యే తిరుపతి స్థానంలో ఖచ్చితంగా కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని వంగా గీత ధీమా వ్యక్తం చేశారు. చిరు రాష్ట్ర స్థాయి నుండి జాతీయస్థాయికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ఆయన ఎలాంటి మచ్చ లేని నాయకుడు అని, నీతి నిజాయితీలకు మారు పేరన్నారు. పదవి రాని వారు ఎలాంటి అసంతృప్తి చెందవద్దని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు.

కాగా చిరంజీవి, ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆనంద భాస్కర్‌లకు అధిష్టానం రాజ్యసభ కేటాయించిన విషయం తెలిసిందే. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నాలుగు సీట్లను మన రాష్ట్రానికే సంపాదించడం గమనార్హం. రషీద్ అల్వీ స్థానంలో కర్నాటక రాష్ట్రానికి చెందిన నేతకు ఇవ్వాలనుకున్నప్పటికీ బొత్స సోనియాతో రాష్ట్రానికే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారట. రాత్రి పది గంటల ప్రాంతంలో కాంగ్రెసు అభ్యర్థులను ప్రకటించింది.

English summary
Tirupati MLA Chiranjeevi said that he will follow high command instructions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X