వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛార్జీలు తగ్గించాల్సిందే: కేంద్రానికి మమత ఆల్టిమేటం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
న్యూఢిల్లీ: 2012-13 బడ్జెట్‌లో పెంచిన రైల్వే ఛార్జీలు తగ్గించాల్సిందేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి మరోమారు ఆల్టిమేటం జారీ చేశారు. పెంచిన రైల్వే ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. సామాన్యుడిపై భారం పడకుండా రైల్వే ఛార్జీల్లో మార్పులు చేయాలని ఆమె సూచించారు. ఎగువ తరగతి ఛార్జీలు పెంచినా సహిస్తాం కానీ సాధారణ తరగతి ఛార్జీలు పెంచితో మాత్రం ఊరుకునేది లేదని మమత హెచ్చరికలు జారీ చేశారు. ఛార్జీల పెంపు దారుణమని అన్నారు. కాగా ఎన్‌సిటిసిని వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెసు ఎంపీలు బిజెపి, లెఫ్ట్ పార్టీలు ఆ అంశంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో గైర్హాజరయ్యాయి.

కాగా తృణమూల్ కాంగ్రెసులో ఆదివారమే వివాదం ముగిసింది. రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఎట్టకేలకు రాజీనామా చేశారు. పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడిన తర్వాత రైల్వే మంత్రిగా దినేష్ త్రివేది రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంపించారు. ఆయన స్థానంలో ముకుల్ రాయ్ రైల్వే మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడాతరు. మమతా బెనర్జీతో మాట్లాడిన తర్వాత దినేష్ త్రివేది తన రాజీనామా లేఖను ప్రధానికి పంపారని తెలుస్తోంది.

English summary
TCM chief Mamata Banerjee gave ultimatum to central government on railway charges hike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X