హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సభను వాయిదా వేయడానికి వీలులేదు: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ శాసనసభలో డిమాండ్ చేసింది. సభ మొదటిసారి వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా టిడిపి వివాదాస్పద 26 జివోలను వెంటనే స్పీకర్ ముందు పెట్టాలని డిమాండ్ చేసింది. అవినీతిపై చర్చ జరగాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. సభ వాయిదా వేయడానికి వీలు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా అవినీతిపై చర్చ జరపాలన్నారు. అవినీతిపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

కాగా అంతకుముందు మంత్రుల బర్తరఫ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ పోడియాన్ని టిడిపి సభ్యులు ముట్టడించారు. దీంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత పార్టీలు స్పీకర్‌ను వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు తలపెట్టిన చలో అసెంబ్లీపై సిపిఐ వాయిదా తీర్మానం ఇవ్వగా, 1995 నుంచి ఇప్పటి వరకు అక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్రపై ఎంఐఎం, వికలాంగుల సంక్షేమ పథకాలపై సిపిఎం, గల్ఫ్ దేశాల్లో ఇక్కట్ల పాలవుతున్న తెలంగాణ యువతను అదుకోవాలని టిఆర్ఎస్ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

English summary
Telugudesam Party demanded in Assembly to suspend ministers from cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X