హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిద్దుకోకుంటే తప్పుకోండి: కిరణ్‌కు డిప్యూటీ అల్టీమేటం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Damodara Rajanarasimha
హైదరాబాద్: ఉప ఎన్నికల ఓటమి నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఓటమితో తప్పులు సరిదిద్దుకోవాలని లేదంటే తప్పుకోవాలని హెచ్చరిక జారీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపు వచ్చే ఉప ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఏడు నియోజకవర్గాలలో కాంగ్రెసు ఓటమికి అందరమూ బాధ్యులమేనని అన్నారు. కొవూరు ఫలితం మాకు హెచ్చరిక అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సెంటిమెంట్, మతపరమైన ఫీలంగ్ వల్ల గెలిచిందన్నారు. తెలంగాణవాద ప్రభావం కంటే మతపరమైన ఫీలింగ్ వల్లే అధికంగా బిజెపి లబ్ధి పొందిందన్నారు. తెలంగాణపై కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అధిష్టానం ఈ అంశాన్ని మూసి వేయలేదన్నారు.

అవినీతి అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. తాను తెలంగాణ ఉద్యమానికి ఇప్పట్లో నాయకత్వం వహించనని స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెసుకు ప్రమాద ఘంటికలేనని అన్నారు. వెంటనే జాగ్రత్త వహించాల్సి ఉంటుందన్నారు. కాగా బుధవారం ఎన్నికల ఫలితాలు వెలువడగానే మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు, ఎంపి వివేక్ తదితరులు ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

English summary
DCM Damodara Rajanarasimha warned CM Kiran Kumar Reddy about bypoll results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X