వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంకకు వ్యతిరేకంగా భారత్ ఓటు, ఐరాస తీర్మానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilanka Map
జెనీవా: శ్రీలంక యుద్ధ నేరాలకు వ్యతిరేకంగా అమెరికా ఐక్య రాజ్యసమితి (యుఎన్ఓ)లో అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు చేసింది. శ్రీలంక అరాచకాలపై ఐరాస భగ్గుమంది. అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి 24 దేశాలు మద్దతు పలికాయి. దీంతో ఐరాసలో శ్రీలంకకు చుక్కెదురైంది. ఎల్‌టిటిఇ కార్యకర్తలను, అమాయకులను శ్రీలంక దారుణంగా హింసించి చంపిందనే ఆరోపణలపై అమెరికా ఆ తీర్మానాన్ని ప్రతిపాదించింది. తీర్మానానికి వ్యతిరేకంగా 15 ఓట్లు పడ్డాయి. ఎనిమిది దేశాలు గైర్హాజరయ్యాయి.

శ్రీలంక మానవ హక్కులను ఉల్లంఘించిందనే తీర్మానం ఐరాసలో ఆమోదం పొందింది. ఇటీవల ఎల్‌టిటిఇ అధినేత ప్రభాకరన్ కుమారుడిని శ్రీలంక సైన్యం దారుణంగా హత్య చేసిన క్లిప్పింగులు బయటకు వచ్చాయి. శ్రీలంక అరాచకాలపై ప్రపంచ దేశాలు గత కొద్ది కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంకకు వ్యతిరేకంగా వ్యవహరించాలని తమిళ పార్టీలు డిఎంకె, అన్నాడియంకె నుంచి భారత ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. అమెరికా తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రష్యా, చైనా, బంగ్లాదేశ్ ఓటేశాయి. హక్కుల ఉల్లంఘన పేరుతో ఒత్తిడి పెట్టడం సరైంది కాదని ఈ దేశాలు అభిప్రాయపడ్డాయి.

English summary
India along with 23 other countries on Thursday, May 22 voted for US moved resolution in UN against Sri Lanka while 15 countries voted for Sri Lanka over Lankan war crimes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X