వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదం కాదు: భగవద్గీత మళ్లీ విజయం సాధించింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhagavad Gita
మాస్కో: హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత ఉగ్రవాద సాహిత్యమంటూ వేసిన పిటిషన్‌ను రష్యా కోర్టు మరోసారి కొట్టి వేసింది. భగవద్గీత సగర్వంగా విజయం సాధించింది. అంతర్జాతీయ వేదికపై తన పవిత్రతను మరోమారు రుజువు చేసుకుంది. పవిత్ర గీతను ఉగ్రవాద సాహిత్యంగా పరిగణిస్తూ దాన్ని నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను రష్యన్ కోర్టు కొట్టేసింది. దీంతో కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా హిందువులలో నెలకొన్న ఉద్రిక్తత సడలింది. టామ్స్క్ నగరంలోని కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసిందని మాస్కో ఇస్కాన్‌కు చెందిన సాధు ప్రియదాస్ తెలిపారు. ఇంతకుముందు దిగువ కోర్టు కూడా ఇదే తరహా తీర్పును ఇవ్వగా, అక్కడి న్యాయవాదులు సవాల్ చేశారు. అక్కడా వారికి చుక్కెదురైంది. ఇస్కాన్ వ్యవస్థాపకుడు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద రచించిన భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ గ్రంథం పూర్తిగా విద్వేషపూరితంగా ఉందని, హిందూ మతాన్ని ఆచరించనివారిని అవమానిస్తోందని పేర్కొంటూ దాన్ని నిషేధించాలని వారు పిటిషన్ దాఖలుచేశారు.

దిగువ కోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించినట్లు దాస్ తెలిపారు. కోర్టు నిర్ణయాన్ని రష్యాలో భారత రాయబారి అజయ్ మల్హోత్రా కూడా స్వాగతించారు. తీర్పు వెలువడిన అనంతరం ఇస్కాన్ కోర్టు ప్రతినిధి అలెగ్జాండర్ షకొవ్ కూడా ఇది పూర్తి న్యాయం, అర్ధవంతం ఇంకా ముఖ్యంగా సమంజసమైన నిర్ణయం అని అన్నారు. దేశంలో ఇస్కాన్ మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్ బ్రజేంద్ర నందన్‌ దాస్ కూడా తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. భగవద్గీతను రష్యాలో తొలిసారిగా 1788లో ప్రచురించారు. తర్వాత అనేకసార్లు పలు అనువాదాల్లో ప్రచురితమైంది.

English summary
A Russian court on Wednesday dismissed a petition seeking a ban on a translated version of Bhagavad Gita for being "extremist", bringing cheers to followers across the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X