వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jhina Hikaka
విజయనగరం: మావోయిస్టులు శనివారం తెల్లవారు జామున పాలక బిజెడి పార్టీ శానససభ్యుడు జినా హికాక్‌ను కిడ్నాప్ చేశారు. దీంతో ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితమే మావోయిస్టులు ఇటలీ పర్యాటకులను కిడ్నాప్ చేశారు. మావోయిస్టులు కోరాపుట్ జిల్లా లక్ష్మీపురం వద్ద హికాక్‌ను కిడ్నాప్ చేశారు. మావోయిస్టులుగా భావిస్తున్న 15 మంది శాసనసభ్యుడి కాన్వాయ్‌ని ఆపి కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని కోరాపుట్ ఎస్పీ ధ్రువీకరించారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత పన్నెండున్నర గంటల ప్రాంతంలో కిడ్నాప్ సంఘటన చోటు చేసుకుంది.

శానససభ్యుడి డ్రైవర్‌ను, వ్యక్తిగత సహాయకుడిని మావోయిస్టులు వదిలేశారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. కాగా, కిడ్నాప్ వ్యవహారంపై శనివారం ఒడిషా శాసనసభ అట్టుడికింది. మావోయిస్టులతో చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. ఇద్దరు ఇటలీ పర్యాటకుల విడుదలకు మావోయిస్టులు 13 డిమాండ్లు పెట్టారు. బోసుస్కో పావోలో, క్లాడియో కొలాంజెలో‌ అనే ఇద్దరు ఇటాలియన్లను మావోయిస్టులు గంజాం సరిహద్దుల్లో మావోయిస్టులు మార్చి 14వ తేదీన కిడ్నాప్ చేశారు.

English summary
Maoists abducted a legislator of Odisha's ruling Biju Janata Dal (BJD) early Saturday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X