వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ వెళ్లారు, బొత్స వచ్చారు!:కార్యక్రమాలకు దూరంగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana - Kiran Kumar Reddy
విశాఖపట్నం: ఉక్కు నగరం విశాఖపట్నంలో ఆదివారం జరిగిన కార్యక్రమం ద్వారా కాంగ్రెసులోని విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రులు, ఐఏఎస్‌లు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విశాఖలో ఉన్నంత సేపు ముభావంగా ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సిఎం ఉన్నప్పుడు కాకుండా ఆయన వెళ్లిన ఐదు నిమిషాలకు విశాఖకు వచ్చారు. సిఎం వెళ్లేటప్పుడు విలేకరులు ప్రశ్నించగా వారిపై ఆయన చిర్రుబుర్రులాడారు. విశాఖ నుంచి తొలిసారిగా అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభమవుతున్న సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో సిఎం విశాఖకు చేరుకున్నారు. రాత్రి అదే విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన అన్ని కార్యక్రమాల్లోనూ ముభావంగానే పాల్గొన్నారని తెలుస్తోంది. కార్యక్రమానికి నాలుగు జిల్లాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వస్తారని భావించినప్పటికీ చాలామంది రాలేదు. బొత్స విజయనగరం జిల్లాలోనే ఉన్నప్పటికీ సిఎం కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

మంత్రులు ధర్మాన ప్రసాద రావు, వట్టి వసంత్ కుమార్, బాలరాజు, కొండ్రు మురళితో కలిసి సిఎం హైదరాబాదు బయలుదేరిన ఐదు నిమిషాలకు బొత్స విశాఖ విమానాశ్రయానికి వచ్చి మరో విమానంలో హైదరాబాద్ వెళ్లారు. పర్యాటక అభివృద్ధిపై ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని మంత్రి బాలరాజు అదే హోటల్లో వేరే గదిలో చాలాసేపు గడిపారు. తర్వాత ఎమ్మెల్సీని పంపించి ఆయనను బుజ్జగించారు. ఇదే సమావేశంలో మంత్రి వట్టి ఓ సమయంలో కలెక్టర్‌పై అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. బీచ్‌లో జరిగిన సమావేశంలో మంత్రి వట్టి కమిషనర్‌ను మైకులోనే మందలించారు.

English summary
It seems, the differences in Congress party revealed again in CM Kiran Kumar Reddy Vishaka tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X