హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిందితుడిగా చేర్చడం సరికాదు: గాలి పిఏ అలీఖాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ali Khan
హైదరాబాద్/బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను నిందితుడిగా చేర్చడంపై గాలి పిఏ అలీ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను ఓఎంసిలో నిందితుడుగా చేర్చడం సరికాదంటూ అలీ ఖాన్ సోమవారం నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్‌లో కానీ, ఛార్జీషీటులో కాని తన పేరు ఎక్కడా పేర్కొనలేదని, అలాంటప్పుడు ఈ దశలో తనను నిందితుడిగా చేర్చడమేమిటని అన్నారు. సిఆర్‌పిసి నిబంధనల ప్రకారం ఈ దశలో నిందితుడుగా చేర్చడం సమంజసం కాదన్నారు. మరోవైపు అలీ ఖాన్‌ను హైదరాబాద్‌కు తరలించేందుకు పిటి వారెంట్ జారీ చేయాలన్న సిబిఐ పిటిషన్ పైన విచారణను కోర్టు ఏప్రిల్ నాలుగో తేదికి వాయిదా వేసింది. ఓఎంసి అక్రమాలన్నీ అలీ ఖాన్‌కు తెలుసునని, గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ సంపాదన గుట్టు అంతా ఆయనకే తెలుసునని సిబిఐ అంటోంది. ఇప్పటికే కర్నాటకలోని ఎఎంసి కేసులో అరెస్టైన అలీ ఖాన్‌ను ఓఎంసి కేసులోనూ అరెస్టు చేసి హైదరాబాద్ తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక కోర్టును సిబిఐ కోరింది.

కాగా ఇటీవల గాలి పిఏ అలీ ఖాన్ బెంగళూరు కోర్టులో లొంగి పోయిన విషయం తెలిసిందే. గాలి జనార్ధన్ రెడ్డిని ఎఎంసి కేసు విషయంలో విచారించేందుకు కర్నాటకకు తరలించి అక్కడి కోర్టులో హాజరు పర్చిన రోజే అలీ ఖాన్ లొంగిపోవడం చర్చకు దారి తీసింది. సిబిఐ అధికారుల సూచనల మేరకే ఆయన లొంగిపోయారనే వాదనలు వినిపించాయి. ఆ తర్వాత సిబిఐ ఓఎంసి కేసులోనూ అలీ ఖాన్‌ను నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.

English summary
Karnataka former minister Gali Janardhan Reddy's PA Ali Khan filed memo in Nampally CBI special court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X