వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 14 కోట్లు లంచం ఇవ్వ జూపారు: వికె సింగ్ ఆరోపణ

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Singh
న్యూఢిల్లీ: నాసి రకం సైనిక వాహనాలు, ఇతర సామాగ్రిని కొనుగోలు చేసేందుకు కొన్నేళ్ల క్రితం తనకు 14 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపారని భారత ఆర్మీ చీఫ్ వీకే.సింగ్ ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ దృష్టికి తీసుకుని వెళ్లానని, అయితే ఆంటోనీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని వీకేసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మీకి అవసరమైన వాహనాలను కొనుగోలు చేసే విషయంలో నాసిరకం వాహనాలను కొనుగోలు చేస్తే తనకు రూ.14 కోట్లు ఇస్తానని ఒక మధ్యవర్తి తన వద్దకు వచ్చి బేరం మాట్లాడారని కానీ, తాను వాళ్ళ ప్రలోభానికి లొంగలేదని వీకే సింగ్ తెలిపారు.

అప్పటికే సుమారు 600 వాహనాలను కొనుగోలు చేసినట్టు ఆ మధ్యవర్తి తనకు చెప్పగా, ఈ విషయాన్ని తానే స్వయంగా రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్టు చెప్పారు. దీనిపై విచారణ కూడా జరుగుతోందని వీకే సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ అంశం పార్లమెంట్ ఉభయ సభలను సోమవారం కుదిపేశాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి వీకే సింగ్ ఆరోపణలపై చర్చించాలని ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ పట్టుబట్టి సభా కార్యక్రమాలకు అడ్డు తగిలింది. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

English summary
After the age row caused considerable insult to Indian Army Chief VK Singh, Singh in an interview with popular national newspaper, 'The Hindu' made some stunning revelations stating that he was offered Rs 14 crore as bribe to clear a tranche of 600 sub-standard vehicles by an ex-army man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X