హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈపరిస్థితుల్లో తెలంగాణపై తీర్మానం చేయలేం: జానారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయలేమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి మంగళవారం అన్నారు. ముఖ్యమంత్రి పదవి అంటే అంత సులువు కాదన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ప్రజలు మద్దతిస్తారని అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేదన్నారు. ప్రస్తుతం ఎవరు సిఎం అయినా భరించలేని పరిస్థితి ఉందన్నారు. తనకు సిఎం పదవి కంటే తెలంగాణే ముఖ్యమన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారమైతే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. తాము ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడే మాట్లాడతామని అన్నారు. రాజకీయాల్లో హెచ్చుతగ్గులు సాధారణమే అన్నారు. సీమాంధ్ర నేతల రాజీనామాలతోనే తాను జెఏసితో కలిశానన్నారు. తెలంగాణ జెఏసితో కలిసినందుకు తనపై విమర్శలు వచ్చాయన్నారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పార్టీ పటిష్టతపై చర్చించానని అన్నారు. తాము ఢిల్లీ వెళ్లేది తెలంగాణ కోసం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకేనని చెప్పారు. ఈ నెలాఖరున సీనియర్ నేతలం అందరం ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. తాము తెలంగాణ అంశంపై పార్టీ అధిష్టానాన్ని అడుగుతామన్నారు. ఈసారి తాము కార్యసాధకులమై రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ కోసం తాము గట్టిగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సాధనే తమ లక్ష్యమని జానా రెడ్డి చెప్పారు.

కాగా జానా రెడ్డిని పలువురు సీనియర్ నేతలు ఆయన ఛాంబర్‌లో ఉదయం కలిశారు. దీంతో ఆయన ఛాంబర్ వద్ద హడావుడి కనిపించింది. మాజీ మంత్రులు జెసి దివాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిలు ఆయనను కలిశారు. ఢిల్లీకి వెళ్లే అంశం, పార్టీ తాజా పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతోనూ జానా భేటీ అయి రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

English summary
Minister Jana Reddy said that Resolution on Telangana is not possible by state situations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X