హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొనసాగుతున్న బంద్: ఓయులో బైక్ ర్యాలీ, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Bandh
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో బంద్ స్వల్ప ఉద్రిక్తలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ కోసం వరంగల్ జిల్లాలో ఇద్దరు యువకులు ఇటీవల ఆత్మార్పణం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్క రోజు బంద్‌కు పిలుపునిచ్చింది. తెరాస బంద్‌కు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం తెలంగాణ ఫోరం, తెలంగాణ నగారా సమితి, సిపిఐ మద్దతు పలికాయి. అయితే పదవ తరగతి పరీక్షల దృష్ట్యా బంద్‌లో విద్యాసంస్థలకు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా బస్సులకు మినహాయింపు ఇచ్చారు. దీంతో బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి.

అయితే బస్సులు మినహా రోడ్ల పైన మిగతా వాహనాలు కనిపించడం లేదు. బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ పార్టీల కార్యకర్తలు తెలంగాణ జిల్లాల్లో రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బైక్ ర్యాలీలు తీస్తున్నారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బైక్ ర్యాలీ తీస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థులు మాణిక్యేశ్వర నగర్ నుంచి తార్నాక వైపు ర్యాలీ నిర్వహిస్తుండగా అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయు ఎన్‌సిసి గేటు వద్ద కూడా బైక్ ర్యాలీ తీస్తున్న ఎబివిపి విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నాయి.

వ్యాపార, వాణిజ్య, పెట్రోల్ బంక్, సినిమా హాళ్లు పది జిల్లాల్లో మూతపడ్డాయి. కార్యకర్తలు తెరిచి ఉన్న దుకాణాలు మూసి వేయిస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు 24 గంటల బంద్ నిర్వహిస్తున్నారు. కాగా కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో బంద్‌కు సహకరించని ఊర్వశి థియేటర్ అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

English summary
The TRS has called for a bandh in the Telangana region on Tuesday to protest the government's apparent indifference towards the separate statehood issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X