హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాల్లోకి డబ్బు సంస్కృతి చరిత్ర బాబుదే: గండ్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandra Venkata Ramana Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలలో డబ్బు సంస్కృతి తీసుకు వచ్చారని చంద్రబాబు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్రలో డబ్బు సంప్రదాయాన్ని తీసుకు వచ్చిందని చంద్రబాబే అని ఆరోపించారు. 1996వ సంవత్సరంలోనే ఈ సంస్కృతి తీసుకు వచ్చిన చరిత్ర ఆయనది అని ధ్వజమెత్తారు. చంద్రబాబు క్రమంగా విశ్వాసం కోల్పోతున్నారని అన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయవద్దనే చంద్రబాబు అసంతృప్తి ఆ పార్టీ బలహీనపడుతుందనేందుకు నిదర్శనమన్నారు. ఆ పార్టీ రోజురోజుకు బలహీనపడుతోందన్నారు.

స్పీకర్ సభలో ఆత్మహత్యలకు సంతాపం తెలిపినప్పుడు తెలంగాణ అని అంటే బాగుండేదన్నారు. తెలంగాణ ప్రజల మనోగతాన్ని తాము ఏఐసిసి పరిశీలకులు కృష్ణమూర్తికి వివరిస్తామని చెప్పారు. మాజీ మంత్రి, అనంతపురం జిల్లా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు విభజనకు అంగీకారం తెలిపేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులు, యువత ఎవరు కూడా ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ సాధించుకుందాన్నారు. కేంద్రం కూడా తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎమ్మెల్యే కె లక్ష్మా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉద్యమంలో తాము కీలకంగా లేమన్నారు. తెలంగాణ కోసం తాము చిత్తశుద్ధితో అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తున్నామన్నారు.

కాగా తెలంగాణ నేతలపై ఎమ్మెల్యే విష్ణు చేసిన వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయనను ఫోన్‌లో మందలించారు.

English summary
Congress chief whip Gandra Venkata Ramana Reddy blamed TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X