హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెసి రాయలతెలంగాణ ప్రతిపాదనకు ఒప్పుకోం: కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy - Harish Rao - K Taraka Rama Rao
హైదరాబాద్: మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు బుధవారం మండిపడ్డారు. రాయల తెలంగాణ అన్న జెసి వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదన కేంద్రం తీసుకువస్తే తాము అప్పుడు ఆలోచిస్తామన్నారు. ఆ ప్రతిపాదనను ఒప్పుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. ఈటెల రాజేందర్, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై అప్పీలు చేసే బాధ్యత తమకు లేదా అని వారు ప్రశ్నించారు. ఇది సీమాంధ్ర సభలా కనిపిస్తోందన్నారు. ఆత్మహత్యలపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడిగారు. ఆత్మబలిదానాలు జరుగుతుంటే సీమాంధ్ర నేతలకు మానవత్వం లేదా అని విమర్శించారు. బలిదానాలపై సభలో చర్చ జరగాలన్నారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిందేనని చెప్పారు. సీమాంధ్రుల అడుగులకు మడుగులొత్తే విధానం తెలంగాణ ప్రాంత నేతలు మానుకోవాలని సూచించారు. ఆత్మహత్యలపై సంతాపం తెలుపుతున్న సమయంలో స్పీకర్ తెలంగాణ పదం రాకుండా జాగ్రత్త పడ్డారని విమర్శించారు.

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమన్నారు. టిడిపి, కాంగ్రెసు నేతలు ఇంకా పదవులలో ఎందుకు ఉండాలో ఆలోచించుకోవాలని అన్నారు. ప్రజాక్షేత్రంలో తెలంగాణ ద్రోహులకు శిక్ష తప్పదన్నారు. ఆ రెండు పార్టీల కుట్రలు బయటపడతాయనే సభలో చర్చ జరగకుండా వాయిదాలు వేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం యువత ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. పోరాడి సాధించుకుందామన్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెలికిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తీర్మానం చేసే వరకు సభను నడవనిచ్చేది లేదన్నారు. రాష్ట్రం రావణ కాష్టంలా మారడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.

English summary
TRS MLA K Taraka Rama Rao opposed Congress MLA JC Diwakar Reddy proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X