వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరికృష్ణ పార్టీ వీడరు, ప్రాధాన్యమివ్వాలి: మోదుగుల

By Srinivas
|
Google Oneindia TeluguNews

modugula venugopal reddy
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ పార్టీని వీడి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గురువారం అన్నారు. అయితే హరికృష్ణకు పార్టీలో తగిన ప్రాధాన్యమివ్వాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంతటి నాయకుడు టిడిపికి దొరకడం చాలా అదృష్టమని అన్నారు. గడ్డుకాలం ఏర్పడినంత మాత్రాన ఆయనతో కలిసి పని చేయాలే కానీ, విమర్శిస్తూ కూర్చుంటే పార్టీ ముందుకెళ్లదని అన్నారు. చంద్రబాబును అభిమానిస్తూ ఆయన నాయకత్వంలోనే పని చేయాలని పేర్కొన్నారు.

టిడిపిలో ఎలాంటి లోపాలు లేవని మరో ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో దృక్పథం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాలాన్ని బట్టి రాజకీయాల్లో మార్పులు వస్తుంటాయని, దాన్ని బట్టే పార్టీ నాయకత్వం నడుస్తుందని చెప్పారు. టిడిపి రాకతోనే రాష్ట్రంలో, తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. టిడిపిని ముందుకు తీసుకెళ్లే నాయకత్వ లక్షణాలు చంద్రబాబుకే ఉన్నాయని రమేష్ రాథోడ్ అన్నారు. దేశంలోని ఇతర పార్టీలతో పోలిస్తే టిడిపియే బలంగా ఉందని అన్నారు. చంద్రబాబు తమ కార్యకర్తల కోసం ట్రస్టు ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. కాగా నాయకుల వల్లనే తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు టిడిపిని హీటెక్కించిన విషయం తెలిసిందే.

English summary
TDP mps Nama Nageshwar Rao and Modugula Venugopal Reddy condemned Hari Krishna comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X