చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రికార్డ్ ఆదాయం: నవమి రోజు శ్రీవారికి రూ.5.73 కోట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirumala Temple
చిత్తూరు: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆదివారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జీంచారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రూ.5.73 కోట్లు ఆదాయం వచ్చింది. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు వేంకటేశ్వర స్వామికి హుండీ ద్వారా లభించిన రికార్డు స్థాయి ఆదాయమిది. నగదు మాత్రమేనా దాంతోపాటు కిలో బంగారం కూడా భక్తులు శ్రీవారికి భక్తిగా సమర్పించుకున్నారు. వీటన్నిటికీ విదేశీ కరెన్సీ అదనం. ఐదేళ్లుగా స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకూ పెరుగుతూ రూ.కోటి దాటింది. అజ్ఞాత భక్తులు అధిక మొత్తంలో స్వామివారికి నిధులు సమర్పించిన సమయంలో ఇది రూ.రెండు నుంచి మూడు కోట్లు దాటుతోంది. మొత్తమ్మీద ఏడాదిలో సగటున చూస్తే రోజుకు రూ.కోటిన్నరకు పైగా ఆదాయం హుండీ ద్వారా లభిస్తోంది. 1980 సమయంలో రోజుకు రూ.లక్ష ఆదాయం వస్తేనే విశేషంగా భావించేవారు. అప్పట్లో అజ్ఞాత భక్తుల కానుకలు కూడా రూ.లక్ష దాటేవి కావు. 1990 నుంచి స్వామివారికి హుండీ కానుకలు పెరిగాయి.

పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా హుండీ ఆదాయం కూడా ఎన్నో రెట్లు పెరుగుతూ వస్తోంది. ఐదేళ్ల నుంచి క్రమంగా రోజుకు రూ.కోటి దాటిన ఆదాయం నేడు రూ.5.73 కోట్లకు చేరింది. ఇక నగదుతోపాటు వెండి, బంగారం, ఆభరణాలు, ఇతర కానుకలను కూడా భక్తులు అధికమొత్తంలో సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకూ అత్యధికంగా వచ్చిన ఆదాయం రూ.3.75 కోట్లు కాగా ఆదివారంతో సరికొత్త రికార్డు నమోదైంది. నిజానికి శ్రీరామ నవమిని పురస్కరించుకుని తిరుమలలో రద్దీ స్వల్పంగానే ఉంది. కానీ హుండీ ఆదాయం మాత్రం గణనీయంగా ఉండడం గమనార్హం. మార్చి31తో ఆర్థిక సంవత్సరం ముగిసే నేపథ్యంలో తమకు లాభంగా వచ్చిన సొమ్ము నుంచి పారిశ్రామిక వేత్తలు అధిక మొత్తంలో స్వామి వారికి కానుకలు సమర్పించుకోవడం పరిపాటి. ఈ క్రమంలోనే ఆదివారం ఓ అజ్ఞాత భక్తుడు రూ.మూడు కోట్ల వరకు హుండీలో వేసినట్లు తెలిసింది.

English summary

 Barely three months after creating a new record, the hill shrine of Lord Venkateswara, reckoned as the world's richest Hindu temple, netted a whopping Rs 5.73 crore on Sunday on Srirama Navami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X