కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అరెస్టవుతారు: వీర శివా, లాలూచీ లేదన్న గండ్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandra Venkata Ramana Reddy - Veera Siva Reddy
కడప/చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కమలాపురం శాసనసభ్యుడు వీర శివా రెడ్డి సోమవారం మరోసారి మండిపడ్డారు. జగన్ తన అక్రమాస్తుల కేసులో సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేసినా విచారణ ఎదుర్కొనకుండా దర్యాఫ్తు సంస్థ పైనే ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటు అని విమర్శించారు. మలివిడత ఛార్జీషీటులో మరికొందరు పారిశ్రామిక వేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశముందని ఆయన అన్నారు. త్వరలోనే జగన్‌ను సిబిఐ అరెస్టు చేస్తుందని అన్నారు.

ఆయనను అరెస్టు చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు హెచ్చరిక ప్రకటనలు చేయడం దారుణమన్నారు. వారు అలా హెచ్చరికలు చేస్తున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు. వారికి తగిన బుధ్ది చెబుతుందన్నారు.అగ్నిగుండం అనే మాట పక్కన పెడితే వైయస్సార్ కాంగ్రెసు నేతలు పలాయనం చిత్తగించే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఆ పార్టీ నేతల హెచ్చరికలకు ఎవరూ భయపడరన్నారు.

మరోవైపు కాంగ్రెసు పార్టీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో లాలూచీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు. ఇద్దరూ కలిసి పని చేస్తున్నారన్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల కోసం వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.

కాగా శనివారం సిబిఐ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ ఛార్జీషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో జగన్‌ను సిబిఐ ఎ-1 నిందితుడిగా పేర్కొంది. అయినప్పటికీ ఆయనను అరెస్టు చేయకపోవడంపై తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుపై విమర్శలు గుప్పించింది. దీనిపై గండ్ర స్పందించారు. మరోవైపు వీర శివా రెడ్డి యువ నేత పైన మొదటి నుండి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ అవినీతిపరుడంటూ ఆయన పలుమార్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

English summary

 Congress MLA Veer Siva Reddy said that YSR Congress Party chief YS Jaganmohan Reddy will arrest by CBI soon. Chief Whip Gandra Venkata Ramana Reddy condemned Telugudesam Party allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X