హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు జీవితంలో శాశ్వతంగా 'పవర్' కట్: పొన్నాల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు. చంద్రబాబు నాయుడుకు జీవితంలో శాశ్వతంగా పవర్ కట్ అయిందన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. చంద్రబాబు ప్రస్తుతం రాజకీయ అంధకారంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన పట్ట పగలే లాంతర్లు పట్టుకొని తిరిగిన రకమని విమర్శించారు.

రైతులు, పేద మధ్య తరగతి ప్రజలపై పెంచిన ఛార్జీల ప్రభావం అంతగా ఉండదన్నారు. 1.17 కోట్ల వినియోగదారులపై ప్రభావం అంతంత మాత్రమే అన్నారు. 50-100 యూనిట్ల వరకు ఛార్జీలను తగ్గించామని చెప్పారు. గతంలో అవలంభించిన శ్లాబ్ విధానంలో ఎలాంటి మార్పు లేదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల వ్యవసాయదారులకు ఎలాంటి నష్టం లేదన్నారు. వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్ కొనసాగుతుందని చెప్పారు.

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి బుధవారం అన్నారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు బాగా ఆరాటపడుతున్నారని గండ్ర విమర్శించారు. కాంగ్రెసులో సమస్యలు ఉన్నప్పటికీ తాము వాటి నుండి బయట పడతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

డిసిసి అధ్యక్షుల ఎంపిక విషయం చర్చించడానికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను అధిష్టానం ఢిల్లీకి పిలిపించిందన్నారు. కాంగ్రెసులో విభేదాలు కొత్త కాదని బాలరాజు అన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఉంటుందని అన్నారు. బొత్స, కిరణ్ మధ్య ఎలాంటి అగాథం లేదన్నారు.

English summary
IT Minister Ponnala Laxmaiah lashed out at TDP chief Nara Chandrababu Naidu on wednesday. He said, politically Chandrababu power was cut, he may not sit in opposition after next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X