హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

25ఏళ్ల పనికి గుర్తింపు: రాజ్యసభ ఎంపి సిఎం రమేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 CM Ramesh
కడప/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి తాను ఇరవై ఐదేళ్ల పాటు సాధారణ కార్యకర్తగా పని చేసినందుకు గుర్తింపుగా రాజ్యసభ సీటు లభించిందని కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ బుధవారం అన్నారు. రాజ్యసభ ఎంపి అయిన తర్వాత తొలిసారిగా ఆయన స్వగ్రామం పొట్లదుర్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు లభించిన ఎంపి పదవి జిల్లాలోని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు దక్కుతుందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి అయి ఉండి పులివెందుల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చలేక పోయారని విమర్శించారు. ప్రస్తుతం పులివెందులలో ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. తాను ఎంపీగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు.

యువత పట్టుదలతో శ్రమిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని మరో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హైదరాబాదులో అన్నారు. జనాభాలో అధికశాతం 23 ఏళ్లకు లోపు వారే అన్నారు. ఇది మన దేశానికి ఓ వరమన్నారు. వారిలో క్రమశిక్షణ, నైతిక విలువల్ని పెంపొందించేలా చర్యలు చేపడితే ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రభాగాన నిలుస్తుందని అన్నారు.

సుజనా ఫౌండేషన్ రజతోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఇంజనీరింగ్ విద్యార్థులకు బహుమతులు అందించారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

English summary
Telugudesam Party Rajya Sabha MP CM Ramesh said that he worked 25 years in party as a worker. He said Rajya Sabha is recognization to my work in party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X