హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తారా చౌదరిని వారం రోజుల కస్టడీకి కోరిన పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tara Choudary
హైదరాబాద్: అమాయక యువతులను ఆకర్షించి వ్యభిచార రొంబిలోకి దింపుతున్న తారా చౌదరిని తమ కస్టడీకి వారం రోజుల పాటు అప్పగించాలని పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటషన్ పైన విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఆమె నివాసంలో ప్రవేశించిన ప్రతి వ్యక్తి ఇంట్లో ఏ గదిలోకి వెళ్లినా రహస్య కెమెరాలు చిత్రీకరిస్తాయి. సంభాషణలను రికార్డ్ చేసేందుకు శక్తివంతమైన మైకులను అమర్చింది. రహస్య కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను ల్యాప్ టాప్‌లోకి ఎక్కించి వాటి నుంచి సిడిలు తయారు చేస్తుంది.

ఆమె ఇంట్లో రెండు రహస్య కెమెరాలు బంజారాహిల్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్ లో మరింత సమాచారం ఉన్నా వాటికి కోడ్ ఉండటంతో పోలీసులకు వివరాలు లభ్యం కావడం లేదని తెలుస్తోంది. వీటిపై స్పష్టత కోసమే వారం రోజుల పాటా తామా తారా చౌదరి కస్టడీని అడుగుతున్నట్లు పోలీసులు కోర్టుకు విన్నవించారు. కాగా కొద్ది నెలల క్రితం నుంచి ఓ పోలీసు అధికారి వేధింపులు మొదలుకావడం, సదరు అధికారికి ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండటంతో బెంగళూరుకు మకాం మార్చేందుకు తారా చౌదరి సిద్ధం చేసుకుందంట.

కాగా ఉద్యోగాలిప్పిస్తామని, సినీ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు యువతులను నమ్మించి నగరానికి రప్పించి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న తారా చౌదరి, ఆమె సన్నిహితుడిని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి ఆదివారం రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే.

విజయవాడకు చెందిన తార చౌదరి తన సన్నిహితుడితో కలిసి బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో విశాలమైన ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొన్నేళ్లుగా ఉంటోంది. ఇటీవల ఓ యువతిని నమ్మించి నగరానికి రప్పించి బలవంతంగా వ్యభిచారం నిర్వహించడంతో వారి నుంచి తప్పించుకున్న యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలు విశాఖపట్నం నగరానికి చెందిన వ్యక్తి.

English summary
Police asked Tara Choudhary custody for week days to reveal all activities of her. Tara Choudhary was arrested on saturday. She sent to remand on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X