వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలవేరి డీని నిషేధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kolaveri
తిరువనంతపురం: అనూహ్యమైన ప్రజాదరణ పొందిన కొలవెరి డీపై ఓ న్యాయవాది కోర్టుకెక్కారు. తమిళ సినిమా 3లో కొలవేరి డీ పిల్లలపై దుష్ప్రభావం చూపుతోందని ఆరోపిస్తూ కేరళ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. నటుడు ధనుష్ పాడి నటించిన ఆ పాటను ప్రదర్శించడాన్ని నిషేధించాలని ఆ న్యాయవాది కోరారు. ధనుష్ భార్య ఐశ్వర్య నిర్మించిన ఆ పాట ప్రదర్శనను నిషేధించాలని పిటిషనర్ ఎం మాదస్వామి కోర్టును కోరారు.

కొలవేరి డీ పిల్లలపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతోందని ఇడిక్కిలోని పీర్మెడిలో పోస్టల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాదస్వామి ఆరోపించారు. ఆయన 30 గంటల 6 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేసి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కారు. హింసాత్మకమైన లిరిక్స్ ఉన్న ఆ పాట ఉద్రేకపూరితమైన ఆలోచనలను రేకెత్తిస్తుందని, అమెరికా సైకలాజికల్ అసోసియేషన్ తాజాగా ప్రచురించిన అధ్యయనం ప్రకారం లిరిక్స్‌లో ప్రత్యక్ష హింసకు సంబంధించిన అంశం ఉందని ఆయన అన్నారు.

వాయిలెంట్ సాంగ్స్ తీవ్రమైన పదాలతో అగ్రెసివ్ అన్వయాన్ని ఇస్తాయని ఆయన అన్నారు. కొలవెరి డీ వాయిలెంట్ సాంగ్స్ జాబితాలోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ పాటను పిల్లలు పాడడం పట్ల కేరళ, తమిళనాడుల్లోని కొన్ని పాఠశాలల్లో ఆక్షేపణ వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. అమ్మాయిలను ఏడిపించడానికి మగపిల్లలు ఈ పాటను ఆలపిస్తున్నారని ఆయన చెప్పారు.

ఐశ్వర్య నిర్మించిన 3 చిత్రంలోని ధనుష్ పాట సినిమా విడుదలకు ముందే విశేష ప్రజాదరణ పొందింది. అనూహ్యమైన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దానిపై దృష్టి పడింది. దానికి అనేక పేరడీలు కూడా వచ్చాయి. వివిధ విషయాలకు అన్వయిస్తూ పేరడీలు చేయడం మామూలు వ్యవహారంగా మారింది.

English summary
The 'Kolaveri di' song from Tamil movie '3' has become a chart-buster but a PIL filed in the Kerala High Court claims it is having a 'bad' influence on children and has sought a direction to prohibit screening of the song sung by actor Dhanush.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X