వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ దర్యాఫ్తు కోరుతా: లైంగిక ఆరోపణలపై నిత్యానంద

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nithyananda Swami
బెంగళూరు: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. యుఎస్‌కు చెందిన ఒకరితో కొన్నేళ్ల క్రితం నిత్యానంద లైంగిక సంబంధాలు కొనసాగించారనే ఆరోపణలపై కర్నాటక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(సిఐడి) ఇటీవల కోర్టులో అదనపు ఛార్జీషీట్ దాఖలు చేసింది. దీనిపై నిత్యానంద స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే ఈ కేసును సిబిఐ దర్యాఫ్తు చేయాలని ఆయన అన్నారు.

తాను తనను విచారించే కోర్టును, హైకోర్టును సిబిఐ విచారణ చేయించాల్సిందిగా అడుగుతానని చెప్పారు. సిబిఐ విచారణ ద్వారా తన నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పారు. ఏదో ఒకరోజు తన పైన వస్తున్న ఆరోపణలు తప్పని తేలుతుందన్నారు. సిబిఐ వచ్చి తనను ప్రశ్నిస్తే నా తప్పు ఏమీ లేదని నిరూపిస్తానన్నారు. ఇవి నిరాధార ఆరోపణలు అన్నారు.

తనపై ఇలాంటి ఆరోపణ ఎందుకు వచ్చిందో తాను కూడా తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలవాల్సి ఉందన్నారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి చిన్న పిల్లల పట్ల దుష్ప్రవర్తన కేసులో నిందితుడు అన్నారు. ఇతను యుఎస్‌లోని విచారణ ఎదుర్కొంటున్నారని అన్నారు. తాను 2010 మార్చిలో అరెస్టయ్యానని, అతను 2010 నవంబరులో అరెస్టయ్యారని గుర్తు చేశారు.

తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి తాను అరెస్టయినప్పుడే బయటకు వచ్చి ఎందుకు ఆరోపణలు చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇతను కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడని, దానిని నుండి తప్పించుకునేందుకు తనపై ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు.

English summary
Self-proclaimed godman Swami Nithyananda has claimed he was being ''framed'' in a sex-related case and demanded a CBI probe to unravel the ''truth''. Recently, the Criminal Investigation Department in Karnataka had filed an additional chargesheet against Nithyananda for allegedly having sexual relations with a US-based individual a few years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X