హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తారా చౌదరి కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Tara Chowdhary
హైదరాబాద్: సెక్స్ రాకెట్ నడుపుతూ అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. విచారణ నిమిత్తం తారా చౌదరిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

తారా చౌదరిని పోలీసు కస్టడీకి అప్పగిస్తే ప్రముఖుల పేర్లు, వారి శృంగార కార్యకలాపాలు బయటపడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. విచారణను బంజారాహిల్స్‌లో కాకుండా మరో చోట చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసులు తారా చౌదరి ఇంటిలో సోదాలు నిర్వహించి, పెన్ డ్రైవ్‌లు, మెమోరీ కార్డులు, ఫోన్ డైరీ, లాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించనున్నారు.

తారా చౌదరితో గంటల తరబడి సెల్ ‌ఫోన్‌లో మాట్లాడినవారిలో ప్రముఖులే ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పోలీసాఫీసర్లు అందులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎక్కువగా సంపన్నులతోనే ఆమె సంబంధాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. తారా చౌదరితో మాట్లాడినవారిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రంగారెడ్డి, విశాఖపట్నం జిల్లాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు, కర్నూలు జిల్లాలకు చెందిన కొంత మంది రాజకీయ నాయకులతో తారా చౌదరి అలియాస్ రాజేశ్వరి గంటల తరబడి మాట్లాడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక సెల్‌ఫోన్‌లో సందేశాలకు అంతే లేదని అంటున్నారు. అమ్మాయిలతో కస్టమర్ల శృంగార సంఘటనలను తారా చౌదరి రికార్డు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆమెను విచారిస్తే అవి బయటకు రావచ్చునని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Hearing on petition filed by Banjara hills police seeking Tara Chowdary's custody has been adjourned for April 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X