వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సయీద్ సవాల్: ఆధారాల కోసమే రివార్డన్న అమెరికా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hafiz Saeed
వాషింగ్టన్/ఇస్లాబామాబ్: లష్కరే తోయిబా చీఫ్, ముంబయి దాడుల సూత్రదారుడు హఫీజ్ మహమ్మద్ సయీద్‌ను పట్టించినందుకు తాము రివార్డ్ ప్రకటించలేదని అమెరికా స్పష్టం చేసింది. తన ఆచూకి చెబుతానని దమ్ముంటే పట్టుకోవాలని అమెరికాకు సయీద్ సవాల్ చేసిన నేపథ్యంలో అమెరికా స్పందించింది. సయీద్ ఎక్కడ ఉంటారో తెలుసునని, అయితే ఆయనను అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో విచారణ కోసం అవసరమైన సమాచారం కోసమే తాము 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించినట్లు తెలిపింది.

అతను ఎక్కడున్నాడో మాకు తెలుసునని, పాకిస్తాన్‌లోని ప్రతి జర్నలిస్టుకు తెలుసునని చెప్పారు. ఎలా ఆయనను పట్టుకోవాలో కూడా తెలుసునని చెప్పారు. కానీ తాము ఆయనను నేరస్తుడిగా బోనులో నిలబెట్టే సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఆయనను ఆధారాలతో సహా బోనులో నిలబెట్ట కలిగితే పాకిస్తానే అతనిని అరెస్టు చేసి విచారించవచ్చునని పేర్కొంది.

మరోవైపు సయీద్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి స్పష్టం చేశారు. అతనిని అరెస్టు చేసి బోనులో నిలబెట్టగల ఆధారలేవీ లేవన్నారు. కాగా ఇటీవల అమెరికా హఫీజ్ మహమ్మద్ సయీద్‌పై 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ హర్షం వ్యక్తం చేసింది.

అయితే దమ్ముంటే తనను పట్టుకోవాలని సయీద్ అమెరికాకు సవాల్ విసిరారు. తాను ఎక్కడున్నానో చెబుతానని, తనను పట్టుకోవాలని ఆ రివార్డ్ తనకే ప్రకటించాలని ఆమెరికాకు సూచించారు. ఆయన చేసిన సవాల్‌కు అమెరికా పై విధంగా స్పందించింది.

English summary

 The US on Wednesday underlined that USD 10 million bounty for LeT founder Hafiz Saeed is not about finding his location, but to seek information that can convict the alleged mastermind of the Mumbai terror attacks in a court of law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X