వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సయీద్‌పై ప్రశ్నించిన మన్మోహన్, చర్చిద్దామన్న జర్దారీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manmohan Singh-Asif Ali Zardari
న్యూఢిల్లీ: ముంబయి దాడుల సూత్రదారుడు సయీద్ మహమ్మద్ హఫీజ్ విషయమై పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ వద్ద ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రస్తావించారు. అయితే దీనిపై చర్చించాల్సి ఉందని జర్దారీ చెప్పి దాట వేత ధోరణి ప్రదర్శించారు. కాగా ఉదయం పాకిస్తాన్ నుండి న్యూఢిల్లీ వచ్చిన జర్దారీ అనంతరం మన్మోహన్‌తో భేటీ అయ్యారు. జర్దారీకీ మన్మోహన్ విందు ఇచ్చారు. భేటీ అనంతరం ఇరువురు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ద్వైపాక్షిక అంశాలపై స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నామని ఆయన చెప్పారు. చర్చలు నిర్మాణాత్మకంగా సాగినట్లు తెలిపారు. పాక్ రావాల్సిందిగా జర్దారీ ఆహ్వానించారని చెప్పారు. భారత్-పాక్ ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చలు ఫలవంతంగా సాగినట్లు జర్దారీ చెప్పారు.

మన్మోహన్ సింగ్‌ను తమ పాకిస్తాన్‌కు ఆహ్వానించినట్లు చెప్పారు. అందుకు ఆయన ఒప్పుకున్నారని చెప్పారు. త్వరలోనే ఆయనను పాక్‌లో కలుసుకుంటానని చెప్పారు. భారత్‌తో తాను సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇరువురు ఉగ్రవాదం అంశంపై మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు.

కాగా మన్మోహన్‌ ఇచ్చిన విందు అనంతరం జర్దారీ అజ్మీర్ దర్గాను దర్శించుకునేందుకు వెళ్లారు. అసిఫ్ అలీ జర్దారీతో పాటు ఆయన తనయుడు బిలావల్ జర్దార కూడా భారతదేశానికి వచ్చారు. వీరు సాయంత్రం దర్గాలో ప్రార్థనలు చేస్తారు. పాక్ ప్రధాని పర్యటన సందర్భంగా దర్గా వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సందర్శకుల అనుమతిని వారు వచ్చినప్పుడు ఆపేస్తారు.

English summary
Hafiz Saeed, the alleged mastermind of the Mumbai terror attacks, was discussed in the meeting between Prime Minister Manmohan Singh and Pakistan President Asif Ali Zardari at the 7 RCR on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X