వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్ సర్వే టాప్ 100లో మోడీ, ప్రసన్నానికి అమెరికా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi
న్యూఢిల్లీ: టైమ్ మాగజైన్ టాప్ 100 సర్వే జాబితాలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన 200 మంది వ్యక్తుల జాబితాను టైమ్ రూపొందిస్తోంది. వీరిలో వందమంది పేర్లు వచ్చే సంచికలో ప్రచురించనుంది. టాప్ 100లో మోడి పేరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఇంటర్నెట్‌లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్.

ఈ సందర్భంగా మోడిని టైమ్ పత్రిక ఆకాశానికెత్తింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెసు యువనేత రాహుల్ గాంధీకి అసలైన సవాలు నరేంద్ర మోడీయేనని, ట్రాక్ రికార్డ్, పేరు ప్రతిష్టల ఆధారంగా చూస్తే ప్రధాని పదవికి మోడీయే పోటీదారుడు అని టైమ్ మేగజైన్ ఇటీవల తన కవర్ స్టోరీలో చెప్పింది. అంతేకాకుండా త్వరలో విడుదల కానున్న టాప్ 100లో ఆయన చోటు దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మోడీ ప్రతిభావంతుడైన, సమర్థుడైన రాజకీయవేత్త అని, జాతీయ రాజకీయాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించవచ్చునని అమెరికా మేథావులు చెబుతున్నారు. తమ దేశంలో అడుగు పెట్టడానికి పదేళ్ల క్రితం వీసా నిరాకరించిన అమెరికాలో మోడీకి ఆకర్షణ పెరుగుతుండటం విశేషం.

అయితే ఆయనకు ఇది గుజరాత్ రాష్ట్ర అభివృద్ధి ద్వారా సాధ్యమైంది. రాహుల్ కంటే మోడికి ఫాలోయింగ్ ఎక్కువ అని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ చూస్తే అర్థమౌతుంది. శనివారం ఓటింగ్ పూర్తయ్యే ఇరవై నాలుగు గంటల ముందు వరకు అతను నెగిటివ్ ఓట్ల కంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగా పాజిటివ్ ఓట్లు దక్కించుకున్నారు.

అయితే ఆ తర్వాత మోడీ రెండో స్థానం నుండి మొదటి స్థానం వైపుకు దూసుకు వెళుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయనకు భారీగా వ్యతిరేక ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఉద్దేశ్య పూర్వకంగా వ్యతిరేకంగా పడిన ఓట్లను పక్కన పెడితే మోడీని బలమైన, అభివృద్ధికి పాటుపడుతున్న నేతగా అమెరికా గుర్తిస్తోందని చెప్పక తప్పదు.

English summary
Life has come full circle for Gujarat chief minister Narendra Modi. Spurned by the US once, he is lapping up the attention of the American media now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X