హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామోజీ రావుపై ఎసిబి కేసు, ఇద్దరు ఐఎఎస్‌లపైనా

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావుపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కేసు నమోదు చేసింది. తనది కాని స్థలాన్ని రోడ్డు విస్తరణకు ఇచ్చి, ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి మరో స్థలాన్ని పొందిన వ్యవహారంలో రామోజీరావుపై కుట్ర, చీటింగ్, ఫోర్జరీ, అధికార దుర్వినియోగం వంటి పలు సెక్షన్ల కింద ఎసిబి విచారణ చేపట్టినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఎసిబిలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

రామోజీరావును మొదటి నిందితుడిగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్‌ను రెండో నిందితుడిగా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. రామోజీరావుకు సహకరించిన ఐఎఎస్ అధికారులు ఎస్పీ ప్రసాద్,త కెవి రావుల పేర్లను కూడా నిందితులుగా చేర్చారు. విశాఖపట్నంలోని ఈనాడు కార్యాలయ స్థలం వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఎసిబి విశాఖపట్నం ప్రత్యేక న్యాయస్థానం గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు ఎసిబి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీలోగా నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. సిఐయు చీఫ్ కె. సంపత్ కుమార్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈనాడు కార్యాలయం ఉన్న స్థలాన్ని మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మ నుంచి 1974లో రామోజీరావు లీజుకు తీసుకున్నారు. అందులో కొంత భాగం రోడ్డు విస్తరణకు వెళ్లింది.

దానిపై రామోజీరావు భూయజమానికి సమాచారం ఇవ్వకుండా రోడ్డు విస్తరణకు వెళ్లిన భూమికి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి 872 చదరపు మీటల్రల స్థలాన్ని తన కుమారుడు కిరణ్ పేరిట తీసుకున్నారు. దానిపై భూయజమాని వర్మ ఎసిబి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ వ్యవహారంపై ఎసిబి కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.

English summary
ACB has registered case against Eenadu Ramoji Rao and his son and Ushodaya enterprises MD Kiran in a land dispute issue at Visakhapatnam. Two IAS officers also named in FIR in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X