హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేతలు వాడుకున్నారు, గుట్టు విప్పుతా: తారా చౌదరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tara Chowdhary
హైదరాబాద్: తనను కొందరు రాజకీయ నాయకులు వాడుకున్నారని తారా చౌదరి మంగళవారం మీడియాతో చెప్పింది. మంగళవారం రెండో రోజు తారా చౌదరిని బంజారాహిల్స్ పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. చంచల్ గూడ మహిళా జైలులో ఉన్న ఆమెను పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తారా చౌదరిని మీడియా పలకరించింది.

తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె చెప్పింది. కావాలనే తనను వ్యభిచారం కేసులో ఇరికించారని ఆమె ఆరోపించింది. తనకు చంపుతానని పలు బెదిరింపులు వస్తున్నాయని చెప్పింది. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతానని తెలిపింది. తాను అమాయకురాలిని అని పేర్కొంది.

తాను సినీ ఆర్టిస్టును కాబట్టి సినిమా వాళ్లతో సంబంధాలు ఉంటాయని తెలిపింది. తనను కొందరు రాజకీయ నేతలు వాడుకున్నారని చెప్పింది. సమయం వచ్చినప్పుడు వారి గుట్టు బయట పెడతానన్నది. తాను అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి లాగాననే ఆరోపణలను ఆమె ఖండించింది. తాను ఏ అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి లాగలేదని తెలిపింది. డిజిపి, హోంమంత్రి రక్షణ కల్పిస్తే అన్ని విషయాలు బయట పెడతానని చెప్పింది.

తన లాప్‌టాప్‌లో ఏమీ లేదని తెలిపింది. తాను నిర్దోషినని, సిబిఐ విచారణ జరిగితే తాను కేసులోంచి బయటపడతాననే నమ్మకం ఉందన్నారు. తనకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రాణభయముందని చెప్పింది. పోలీసు విచారణపై తనకు నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందన్నారు.

తాను హోంమంత్రి, డిజిపిని రక్షణ కోరతానని చెప్పింది. సిబిఐ విచారణలో తాను అన్నీ చెబుతానని తెలిపింది. లక్ష్మీ అనే అమ్మాయి ఎవరో తనకు తెలియదని చెప్పింది. తనను చాలా బ్యాడ్‌గా చిత్రీకరిస్తున్నారని ఆవేద చెందారు. ఇదంతా కావాలనే చేస్తున్నారని తెలిపింది. సిబిఐ విచారణ చేస్తే దీని వెనుక కుట్రదారులు ఎవరో బయటకు వస్తుందన్నారు.

కాగా ఉద్యోగాలు, సినిమా అవకాశాల పేరిట తారా చౌదరి అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి దింపుతుందనే ఆరోపణల కారణంగా ఇటీవల ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం ఆమెను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు.

తమ కస్టడీకి తారా చౌదరిని నాలుగు రోజులు ఇవ్వాలని, గుట్టు విప్పుతామని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు తారా చౌదరిని, ఆమె భర్త ప్రసాద్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆదివారం నుండి ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, సోమవారం నుండి తారను తీసుకొని విచారిస్తున్నారు.

English summary
Tara Choudhary said that she will be revealed the political leaders secrets, who were use her. She told media, she is innocent, while Banjara Hills police taking her in to their custody on tuesday for enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X