వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచం ఆరోపణలపై సిబిఐకి వికె సింగ్ ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Singh
న్యూఢిల్లీ: ప్రమాణాలు లేని ట్రక్కులు కొనుగోలు చేయాలంటూ ఓ సీనియర్ రిటైర్డ్ అధికారి తనకు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలపై ఆర్మీ చీఫ్ వికె సింగ్ సిబిఐకి ఫిర్యాదు చేశారు. సిబిఐ ఆ ఫిర్యాదును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వివరమైన ఫిర్యాదు ఇవ్వడానికి ఆయన ఇంతకు ముందు కొంత సమయం కోరారు. తనకు లంచం ఇవ్వజూపిన రిటైర్డ్ అధికారి తేజేందర్ సింగ్ అని ఆయన చెప్పారు.

తుక్కు ట్రక్కులు కొనుగోలు చేయడానికి తనకు 14 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపారని, తాను ఈ విషయాన్ని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీకి తెలిపానని ఆయన అంతకు ముందు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రక్షణ మంత్రిత్వ శాఖ సిబిఐ విచారణకు సిఫార్సు చేసింది. దీంతో వికె సింగ్ సిబిఐకి లాంఛనంగా మంగళవారం ఫిర్యాదు చేశారు.

ఇదిలా వుంటే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ తేజేందర్ సింగ్ ఆర్మీ చీఫ్ వికె సిగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. వికె సింగ్‌పై ఆయన నేరపూరితమైన పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కోర్టు నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. సాక్ష్యాలను విశ్లేషించే పనిలో పడింది. విశ్లేషణలో లభించే ఆధారాలను బట్టి వికె సింగ్‌కు సమన్లు ఇవ్వాలా, వద్దా అనే విషయంపై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.

తాను లంచం ఇవ్వజూపినట్లు వికె సింగ్ చేసిన ఆరోపణలను తేజేందర్ సింగ్ ఖండించారు. వికె సింగ్ పేరుతో పాటు ఆయన ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ ఎస్‌కె సింగ్, లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ భాస్కర్, మేజర్ జనరల్స్ ఎస్ఎల్ నరసింహన్, లెప్ఠినెంట్ కల్నల్ హిట్టెన్ సహానీ పేర్లను కూడా ఆయన చేర్చారు. తనపై ఆరోపణలు చేసే విషయంపై వారు అధికారిక హోదను, అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

English summary
Army chief Gen VK Singh has filed a formal written complaint with the CBI over his alleged bribe offer from a senior retired officer to clear 'sub-standard' trucks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X