గాలి అక్రమ మైనింగ్ కేసులో ఆ ఇద్దరు కీలకం

విచారణకు రాకపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తుల కోసం సిబిఐ అధికారులు గాలిస్తున్నట్లు సమాచారం. నోటీసులు జారీ అయిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు తమకు ఆరోగ్యం బాగాలేదని, త్వరలో వస్తామని చెప్పడంతో సిబిఐ మరి కొంత గడువు ఇచ్చింది. అయితే, నోటీసులు జారీ అయి నెల రోజులు పూర్తయినా వారి జాడ లేదు. దీంతో వారిద్దరి కోసం సిబిఐ అధికారులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల చంద్రశేఖర్ భార్యను, మరో మహిళను సిబిఐ అదుపులోకి తీసుకుని విచారించినట్లు వార్తలు కూడా వచ్చాయి. చంద్రశేఖర్ ఆచూకీ కోసమే వారిని విచారించినట్లు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి గతంలో ఎనిమిది మంది వ్యక్తిగత సహాయకులు పనిచేసేవారని తెలుస్తోంది. వారిలో నలుగురు పూర్తిగా ఆయన వ్యక్తిగత, ఆర్థి, రాజకీయ వ్యవహారాలతో పాటు కర్ణాటక రాజకీయాలను పర్యవేక్షించేవారంటారు. మిగిలిన నలుగురు ఒఎంసి వ్యవహారాలను చూసుకునేవారిని సమాచారం.
ఒఎంసి వ్యవహారాలను చూసే నలుగురిలో ఆనందరెడ్డి, చంద్రశేఖర్ ఉన్నట్లు సిబిఐ అనుమానిస్తోంది. రెండు మూడు రోజుల్లో వీరిద్దరని తమ ముందు హాజరు పరచాలని సిబిఐ అధికారులు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. వారు హాజరు కాకపోతే కుటుంబ సభ్యులను బెంగళూర్ తరలిస్తామని కూడా హెచ్చరించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications