• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సమగ్ర దర్యాఫ్తు జరపాలి: తారా చౌదరిపై నన్నపనేని

By Srinivas
|

Nannapaneni Rajakumari
హైదరాబాద్: తారా చౌదరి కేసులో సమగ్ర దర్యాఫ్తు జరపాలని తెలుగుదేశం పార్టీ నేత, శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి బుధవారం సూచించారు. మహిళలను మరో మహిళ మోసం చేసినా తీవ్రంగానే స్పందించాలని ఆమె పేర్కొన్నారు. దర్యాఫ్తు ఏకపక్షంగా ఉండకూడదని తార అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని మరో టిడిపి నేత వనిత చెప్పారు. తారా చౌదరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటేనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తారా చౌదరి వ్యవహారంపై బుధవారం మహిళా శిశు సంక్షేమ శాసనసభా కమిటీలో చర్చనీయాంశంగా మారింది. ప్రలోభాలకు గురి చేయడం ద్వారా బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపడం సరికాదని, దీనిని ఓ రాకెట్‌గా నిర్వహించడం శిక్షార్హమని కమిటీ అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాఫ్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కమిటీ పేర్కొంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో కమిటీ చైర్మన్ ఉషారాణి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

ఉద్యోగావకాశాలు, సిని ఆవకాశాల పేరిట తారా చౌదరి పలువురు అమ్మాయిలని వ్యభిచార రొంపిలోకి దింపిందనే ఆరోపణల నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఆమె భర్త ప్రసాద్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం శనివారం తారను, ప్రసాద్‌ను కోర్టులో హాజరు పర్చారు. కోర్టు వారిద్దరిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది.

వారిద్దరినీ పోలీసులు ఆది వారం నుండి బుధవారం వరకు విచారించారు. ఈ విచారణలో ఎన్నో విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. పలువురి రాసలీలలను తారా రికార్డు చేయించినట్లు తెలిసిందని సమాచారం. వివిధ టీవీ చానెళ్లు చేసిన వార్తాకథనాల ప్రకారం - పోలీసులు తారా చౌదరి నుంచి రాసలీలల వీడియోలను, ఆడియోలను స్వాధీనం చేసుకున్నారు. తారా చౌదరి ల్యాప్‌టాఫ్‌లో ఆడియో రికార్డింగులే ఉన్నట్లు సమాచారం.

ఉన్నత విద్యాభ్యాసం చేసిన విద్యార్థులే ఎక్కువగా తారా చౌదరి కస్టమర్లని తెలుస్తోంది. వారి సంభాషణలను ఆమె ఆడియో రికార్డింగ్ చేసినట్లు సమాచారం. తారా చౌదరి పనుపు మేరకు హనీఫ్ అనే వ్యక్తి ఆడియో, వీడియో రికార్డులు చేసేవాడని అంటున్నారు. అతని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అతను పట్టుబడితే కీలకమైన విషయాలు బయటపడుతాయని అంటున్నారు.

తారా చౌదరి వద్ద పలువురు విఐపిల చిట్టా ఉన్నట్లు తెలుస్తోంది. విఐపిల్లో ఎక్కువగా వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. కస్టమర్లకు ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉండేదని అంటున్నారు. లెక్కలేనంత మంది వ్యాపారులు ఆమె వద్దకు వచ్చేవారని అంటున్నారు. తెలంగాణ, రాయలసీమలకు చెందిన ఒక్కరేసి పార్లమెంటు సభ్యులతో, ఇద్దరు ఆంధ్ర పార్లమెంటు సభ్యులతో, ఆరుగురు శానససభ్యులతో తారా చౌదరికి సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా తారా చౌదరికి కోర్టు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader Nannapaneni Rajakumari appealed to complete enquiry in cine actor Tara Choudhary case. woman and child welfare legislative committee talk about Tara Choudhary case in meeting on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more