వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఇండియాకు రూ. 30 వేల కోట్లు: అజిత్ సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Air India
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎయిర్ ఇండియాకు 2020నాటికి 30 వేల కోట్ల రూపాయలు అందించనున్నట్లు పౌర విమాన యానాల మంత్రి అజిత్ సింగ్ గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ట్రాన్స్‌పోర్టు, నిర్వహణ మరమ్మత్తులకు వీటిని అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియా కోసం ఆర్థిక పునర్వ్యస్థీకరణ ప్రణాళికను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది.

ఎయిర్ ఇండియాకు రెండు వారాల్లో మొదటి డ్రీమ్ లైనర్ విమానం వస్తుంది. ఎయిర్ ఇండియా పునర్వ్యస్థీకరణ అవసరమని, ఎంతో కాలం ప్రజాధనాన్ని దానిపై ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని అజిత్ సింగ్ అన్నారు. దేశంలోని పౌర విమానయాన రంగంలోకి విదేశీ పెట్టుబడుల అనుమతిపై ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

ఆర్థిక పునర్వ్యస్థీకరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలను అదనపు ఈక్విటీగా అందిస్తుంది. దాంతో ఎయిర్‌లైన్స్ ఈక్విటీ బేస్ రూ. 7.345కి పెరుగుతుంది. పౌర విమాన యాన రంగంలోకి విదేశీ పెట్టుబడుల అనుమతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంపై పలువురు నిరాశకు లోనయ్యారు.

విదేశీ పెట్టుబడులను అనుమతి ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చునని కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా వంటివారు ఆశిస్తూ వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ, అజిత్ సింగ్ నేతృత్వంలోని పౌర విమాన యానాల శాఖ స్థానిక కారియర్స్‌లో 49 శాతం వరకు విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అనుమతించాయి. దేశీ కారియర్స్‌లో పెట్టుబడులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

English summary
Union Cabinet Minister Ajit Singh on Thursday, Apr 12 announced that the cabinet has approved turnaround and financial restructuring plans of Air India. However, the cabinet has not taken any decision on Foreign Direct Investment (FDI) in the aviation industry of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X