వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25శాతం పేదలకు: ప్రైవేట్ స్కూల్స్‌కు సుప్రీంకోర్టు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: ప్రయివేటు విద్యా సంస్థలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం షాక్ ఇచ్చింది. విద్యా హక్కు చట్టంపై సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రయివేటు విద్యా సంస్థలు అన్నీ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని తీర్పు చెప్పింది. అన్ ఎయిడెడ్, మైనార్టీ, ప్రయివేటు విద్యా సంస్థలన్నీ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని న్యాయస్థానం పేర్కొంది.

అన్ ఎయిడెడ్ మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రమే ఈ చట్టం నుండి మినహాయింపు ఇచ్చింది. విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం ఉచిత నిర్బంధ విద్యను అన్ని రకాల పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఈ చట్టం ప్రకారం ఇరవై ఐదు శాతం మంది పేద విద్యార్థులకు కేటాయించాలని తీర్పు చెప్పింది.

ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు పొందని విద్యా సంస్థలైనా చట్టాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం సాయం పొందడం పొందక పోవడంతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. విద్యా హక్కు చట్టం మాత్రం తప్పని సరి అని ఆదేశించింది. ఈ చట్టాన్ని ఈ సంవత్సరం నుండే అమలు చేయాలని చెప్పింది. సుప్రీం తీర్పు ప్రయివేట్ విద్యాసంస్థలకు ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు.

రాజస్థాన్ విద్యా సంస్థల సంఘం పిటిషన్ పైన సుప్రీం గురువారం తీర్పు చెప్పింది. విద్యా హక్కు చట్టం తమకు వర్తించదంటూ రాజస్థాన్ ప్రయివేటు పాఠశాలల సంఘం ఇటీవల పిటిషన్ వేసింది. ఈ మేరకు కోర్టు తీర్పు చెప్పింది.

English summary
The Supreme Court on Thursday upheld the various provisions of the Right to Education Act, 2009. The apex court ruled that the RTE Act would apply to all categories of public and private schools except unaided minority schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X