హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఐటి - హైదరాబాద్ విద్యార్థికి రూ. 35 లక్షల ఆఫర్

By Pratap
|
Google Oneindia TeluguNews

IIT-Hyderabad
హైదరాబాద్: జాబ్ ప్లేస్‌మెంట్‌లో ఐఐటి - హైదరాబాద్ విద్యార్థి ఒకతను బంపర్ ఆఫర్ కొట్టేశాడు. అతనికి ఏడాదికి రూ. 35 లక్షల రూపాయల వేతనం ఇవ్వడానికి ఓ సంస్థ ముందుకు వచ్చింది. బిటెక్ (సిఎస్ఇ) విద్యార్థి అరుణ్ చైతన్యకు సంస్థ అంత మొత్తం చెల్లించడానికి ముందుకు వచ్చింది. అతన్ని టోక్యోకు చెందిన ఎఆర్‌పి సాఫ్ట్‌వేర్ సంస్థ వర్క్స్ అప్లికేషన్స్ ఉద్యోగంలోకి తీసుకుంది.

ఐఐటి - హైదరాబాదుకు చెందిన మొదటి బ్యాచ్ బిటెక్, రెండో పిజి (మాస్టర్స్) విద్యార్థుల్లో 115 మందికి ప్లేస్‌మెంటులో జాబ్ ఆఫర్లు వచ్చాయి. ఐఐటి - హైదరాబాదులో ఇదే తొలి ప్లేస్‌మెంట్ మేళా. జాబ్ ఆఫర్స్ పొందిన విద్యార్థులకు సగటున ఏడాదికి 7 లక్షల రూపాయల మేరకు వేతనం పొందుతారు. మొత్తం 156 మంది ప్లేస్‌మెంట్ కోసం రిజిష్టర్ చేసుకున్నారు.

జాబ్ మేళా 2011 డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఎనిమిది కొత్త ఐఐటిల్లో అరుణ్ చైతన్యకు వచ్చిన ఆఫరే అత్యధికం. ఐఐటి - హైదరాబాద్ 2008లో ప్రారంభమైంది. విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడానికి 50 కంపెనీలు ముందుకు వచ్చాయి. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

అమెజాన్, మెక్రోసాఫ్ట్ ఐడిసి, డెలాయిట్, పాయ్‌పాల్ వంటి సంస్థలు సిఎస్ఇ విద్యార్థులను తీసుకోవడానికి ముందుకు వచ్చాయి. నివిడియా, గ్జిలింగ్జ్స్, హెచ్‌పి వంటి సంస్థలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులను తీసుకోవడానికి వచ్చాయి. భారత్ పెట్రోలియం, మహీంద్రా సత్యం వంటి సంస్థలు మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులపై దృష్టి పెట్టాయి. ఈ నెలాఖరు నాటికి మరింత మంది ఉద్యోగాలతో బయటకు వెళ్తారని ఐఐటి - హైదరాబాద్ అధికారులు అంటున్నారు.

English summary
The average salary of the placed students has been pegged at Rs 7 lakh per annum from IIT - Hyderabdm which is started in 2008. The highest salary of Rs 35 lakh per annum was bagged by Arun Chaitanya, a B.Tech (CSE) student. He was recruited by Works Applications, an ERP software firm based in Tokyo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X