హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పహారాలోనే పాతబస్తీ, 5గంటల వరకు కర్ఫ్యూ సడలింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Curfew continues on friday
హైదరాబాద్: పాతబస్తీలో కర్ఫ్యూ శుక్రవారం కూడా కొనసాగుతోంది. అయితే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల సమయం వరకు మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ యథావిథిగా కర్ఫ్యూ కొనసాగుతుంది. కర్ఫ్యూ సడలింపు సందర్భంగా అదే సమయంలో శుక్రవారం ముస్లింల ప్రార్థన సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు.

మాదన్నపేట, సైదాబాదుతో పాటు మొఘల్‌పురా, బహదూర్‌పురా, చార్మినార్ తదితర ప్రాంతాలలోనూ పోలీసులను భారీగా మోహరించారు. హోంగార్డులను కూడా రంగంలోకి దింపారు. కాగా మత ఘర్షణలు చెలరేగిన హైదరాబాద్ పాతబస్తీలో అదివారం నుండి పూట కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. మరోవైపు గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి సైదాబాద్, మాదన్నపేట ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. రోడ్లపై ఉన్న ప్రజలను పోలీసులు ఇళ్లకు పంపించి వేశారు.

మొత్తం మీద పాతబస్తీలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంది. బుధవారం నుండి పోలీసులు కర్ఫ్యూ సడలింపు ఇవ్వడంతో మూడు రోజుల పాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదికి వచ్చారు. నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి వారు ఎగబడ్డారు. కర్ప్యూ ఎత్తివేసిన సమయంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోలేదు. దీంతో పోలీసుల ఊపిరి పీల్చుకున్నారు.

English summary
The situation remained peaceful in the riot-hit areas of old city of Hyderabad on Wednesday as police relaxed curfew for the first time in four days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X