హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు ఝలక్, టిఆర్ఎస్‌లోకి మాజీ డిజిపి పేర్వారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pervaram Ramulu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి) పేర్వారం రాములు షాక్ ఇచ్చారు. తాను త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఆయన తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యలను నిరోధించి, భరోసా ఇచ్చేందుకే తాను తెరాసలో చేరుతున్నట్లు పేర్వారం చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని తెరాస ఎప్పటికీ సజీవంగా ఉంచుతుందనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని సజీవంగా ఉంచాల్సిన అవసరముందని అందుకే తాను తెరాసతో కలిసి వెళ్లేందుకు సిద్ధపడ్డట్లు చెప్పారు.

కాగా పేర్వారం రాములు వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామానికి చెందిన వారు. ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యది పేర్వారంది ఒకే గ్రామం. పేర్వారం తెలుగుదేశం పార్టీ హయాంలో డిజిపిగా పని చేశారు. 2003లో పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగారు.

2008వ సంవత్సరం వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరె కులస్తుల సంక్షేమ సంఘాల్లో అడపాదడపా పని చేస్తున్నారు. తాజాగా ఆయన తెరాసలో చేరనున్నట్లు ప్రకటించారు.

English summary
Former DGP Pervaram Ramulu will join in Telangana Rastra Samithi soon. He worked as state DGP in TDP regime. He hails from Warangal district, which is known for Telangana movement. He retired in 2003. After retiring from DGP post, he joined in Chandrababu Naidu's Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X