వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివక్ష కారణం కాదు: షారూఖ్ నిర్బంధంపై అమెరికా

By Pratap
|
Google Oneindia TeluguNews

Shah Rukh
వాషింగ్టన్: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌ను న్యూయార్క్ విమానాశ్రయంలో నిర్బంధించడానికి వివక్ష కారణం కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మర్కో టోనర్ స్పష్టం చేశారు. ఇందులో మతపరమైన వివక్ష ఏదీ లేదని ఆయన అన్నారు. అమెరికాకు ఇతర దేశాల నుంచి, ఇతర దేశాలకు అమెరికాకు ప్రతి రోజూ వేలాది మంది వచ్చి పోతుంటారని, జాతి వివక్ష కారణాలు ఉంటే వారు ఎలా ప్రయాణించగలరని ఆయన అన్నారు.

షారూఖ్ ఖాన్‌ను సాంకేతిక కారణాలతో మాత్రమే ఆపారని, జాతివివక్ష వల్ల కాదని ఆయన చెప్పారు. అమెరికాకు వచ్చే ముందు ఢిల్లీలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం అధికారులకు ముందే తెలియజేస్తే ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. ఢిల్లీలో రాయబార కార్యాలయంలో తాము అమెరికాలో పాల్గనే కార్యక్రమ వివరాలు, వచ్చేవారి హోదా గురించి ముందుగా తెలియజేస్తే సమస్యలు ఉండవని ఆయన అన్నారు. దానివల్ల ముందే విమానాశ్రయం అధికారులకు సమాచారం చేరవేయడానికి వీలుంటుందని చెప్పారు.

ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటే అనవసరమైన జాప్యం తగ్గుతుందని ఆయన చెప్పారు. అయినా, షారూఖ్ ఖాన్‌కు కలిగిన అసౌకర్యానికి తాము క్షమాపణ చెప్తున్నామని ఆయన అన్నారు. షారూఖ్ ఖాన్‌ను నిర్బంధించలేదని, ఆలస్యం మాత్రమే చేశారని ఆయన అన్నారు.

యేల్ విశ్వవిద్యాలయంలో అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన షారూఖ్ ఖాన్‌ను న్యూయార్క్ విమానాశ్రయాధికారులు నిర్బంధించి అవమానించారనే వార్త తీవ్ర వివాదానికి దారి తీసింది. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దాంతో అమెరికా క్షమాపణ చెప్పింది.

English summary
Caught on the wrong foot over the detaining of Bollywood star Shah Rukh Khan at a US airport twice, Washington has asserted it was not a case of racial profiling or a pattern.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X