హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్ధరాత్రి హైదరాబాద్‌లో ముంబయి మోడల్ హల్‌చల్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులో ముంబై నగరానికి చెందిన మహిళ అర్ధరాత్రులలో హల్ చల్ చేస్తున్నట్లుగా సమాచారం. ఆమె తాగిన మైకంలో అర్ధరాత్రులలో హైదరాబాద్ రోడ్ల పైన, పబ్‌లలో హంగామా సృష్టిస్తోందంట. ముంబైకి చెందిన సదరు మహిళ తాగిన మైకంలో ఇటీవల నలుగురు వ్యక్తుల పైన దాడి చేసిందని సమాచారం.

వారిపై దాడిని పోలీసులు అడ్డుకోబోగా ఆమె వారిని బెదిరించిందట. వారంతంలో నగరంలోని పబ్‌లలో ఈ యువతి ఎప్పుడూ హల్ చల్ చేస్తోందట. తనకు చోటా షకీల్, చోటా కైసర్‌లు తెలుసునని చెబుతూ పబ్ నిర్వాహకులను కూడా హడలెత్తిస్తోందట. తన వెనుక మాఫియా ఉందని ఆమె వారిని, పోలీసులను హెచ్చరిస్తున్నట్లుగా సమాచారం. కాగా ఆమె ముంబయికి చెందిన మోడల్‌గా తెలుస్తోంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కాగా మియాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఓ నిందితుడు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. రాంరెడ్డి అనే వ్యక్తి పోలీసు స్టేషన్‌లో మృతి చెందాడు. ఈయన మృతదేహాన్ని పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ముషీరాబాద్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజిఎం) ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేశారని అంటున్నారు.

పోలీసులు దారుణంగా హింసించడం వల్లనే రాంరెడ్డి మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు మాత్రం రాంరెడ్డి అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతున్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

మియాపూర్ పోలీసులు రాంరెడ్డిని మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు. ఈయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. మదీనాగూడకు చెందిన ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో పోలీసులు రాంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు పెట్టిన వ్యక్తి ఓ రైసు మిల్లు వ్యాపారి అని తెలుస్తోంది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రాంరెడ్డిని అరెస్టు చేశారు.

English summary
It is said that A Mumbai woman creating hulchul at weekends midnight in Hyderabad. The allegations revealed that she was beaten four people last midnight. She is creating tension after drinking alcohol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X