వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌ గాంధీ 'బ్రాహ్మణ' వ్యాఖ్యలు, బిజెపి మండిపాటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ బ్రాహ్మణ వ్యాఖ్యలు పార్టీలో, బయటా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం చవి చూసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ ఇటీవల సమీక్ష జరిపారు. ఈ సమయంలో ఆయన తాను బ్రాహ్మణుడిని అని.. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిని అని చెప్పారు. పార్టీకి బ్రాహ్మణులు దూరం అవుతున్నారన్న ఓ పార్టీ నేత వ్యాఖ్యలకు సమాధానంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారట.

మైనారిటీ, బిసి కార్డును ప్రయోగించడం ద్వారా యుపి ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న కాంగ్రెస్ కలలు కల్లలు కావడంతో పార్టీలోని బ్రాహ్మణ నాయకులు తమ స్వరాన్ని తీవ్రం చేశారట. కాంగ్రెస్‌కు గతంలో అండగా నిలిచిన అగ్రకులాల వారిని ముఖ్యంగా బ్రాహ్మణులను పార్టీ దూరం చేసుకొందని వారిని తిరిగి దరి చేర్చుకోవాల్సిన అవసరం ఉందని స్థానిక నేత ఒకరు ఈ సమీక్షా సమావేశంలో అన్నారు. సదరు నేత ఈ వ్యాఖ్య చేయగానే రాహుల్ గాంధీ తీవ్ర స్వరంతో బ్రాహ్మణులు, అగ్రకులాల వారు కాంగ్రెస్‌కు దూరం కాలేదని చెప్పేందుకు ప్రయత్నించారట.

తాను బ్రాహ్మణుడినని, పార్టీలో ప్రధాన కార్యదర్శినని రాహుల్ ఒకింత ఆవేశంతో అన్నారట. యుపిలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన బ్రాహ్మణులు, అగ్రకులాల వారిని కాంగ్రెస్ ఇప్పుడు నిర్లక్ష్యం చేసిందన్న వాదన సరికాదని చెప్పేందుకే రాహుల్ ఈ వ్యాఖ్య చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణులు పదిహేను శాతానికి పైగా ఉన్నారు. మొదట వారు కాంగ్రెసు పార్టీ వైపు ఉన్నారు. ఆ తర్వాత గత ఎన్నికలలో మాయావతి వారిని తమ పార్టీ వైపుకు లాక్కుంది. 2007 ఎన్నికల్లో మాయావతి ఎక్కువ మంది బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇచ్చి వారికి తమ పార్టీలో న్యాయం జరుగుతుందని చెప్పారు. దీంతో అప్పుడు వారంతా ఆమెకే ఓటు వేశారు. అయితే మాయా అధికారంలోకి వచ్చాక తమకు ఎలాంటి న్యాయం జరగక పోవడంతో వారు ఇటీవలి ఎన్నికలలో ఎస్పీ వైపు మొగ్గు చూపారు.

అయితే వీరిని మళ్లీ తమ వైపుకు రప్పించుకునే ఉద్దేశ్యంలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా రాహుల్ బ్రాహ్మణ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. యుపి ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెసు సహనం కోల్పోయిందని, అందుకే రాహుల్ ఇప్పుడు తన కులం పేరు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కులం పేరు చెప్పుకోవడం హద్దులు దాటడమే అన్నారు. యుపి ఎన్నికల్లో కాంగ్రెసు మతతత్వ రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు.

English summary
AICC general secretary Rahul Gandhi said in party meeting, he is brahmin and Party general secretary. BJP today took a dig at Rahul Gandhi for his reported comment that he is a brahmin, saying it shows that he and Congress have lost patience after failing to get the mandate in the Uttar Pradesh elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X