వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో భారతీయ యువకుడి దారుణ హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

USA
వాషింగ్టన్: అమెరికాలో ఓ భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ భారతీయ అమెరికన్ రాహుల్ శర్మను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఫ్రేమాంట్‌లో ఈ నెల 5న జరిగిన సంఘటన వివరాలను తాజాగా పోలీసులు వెల్లడించారు. అపార్టుమెంటు ప్రాంగణంలో నిలబడి ఉన్న సమయంలో ఇరవై ఏళ్ల రోహిత్ శర్మను దుండగుడు కాల్చి చంపాడు.

హత్యకు గల కారణాలు తెలియరాలేదు. అనుమానిత వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్య వెనుక నల్ల జాతి యువకుడి హస్తం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. వైట్ టీ షర్ట్ వెసుకొని, చెవికి పెద్ద పెద్ద రింగులు ధరించిన వ్యక్తి ఈ హత్య చేశాడని పోలీసులు విడుదల చేసిన నివేదిక చెబుతోంది.

జలంధర్‌కు చెందిన రోహిత్ శర్మ కుటుంబం ఏడేళ్ల క్రితం అమెరికా వచ్చి స్థిరపడింది. తన కొడుకు ఎంతో క్రమశిక్షణతో ఉంటాడని, ఎలాంటి చెడు అలవాట్లు లేవని హతుడి తల్లి దేవీందర్ శర్మ తెలిపారు. హత్య ఘటనను ఉత్తర అమెరికా పంజాబ్ అసోసియేషన్ సంఘం ఖండించింది. అమెరికాలోని పంజాబీలపై నిత్యం జాతి వివక్ష దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది.

పంజాబీలను లక్ష్యంగా చేసుకుని స్థానికులు తరచుగా దాడులకు దిగుతున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు సత్నాం సింగ్ అన్నారు. ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాహుల్ తన తండ్రి ప్రణ్ శర్మ, తల్లి దేవీందర్ శర్మ, ఇద్దరు సోదరీమణులు మెహెక్, దీప్తీతో కలిసి ఉంటున్నారు.

English summary
A 20-year-old Indian-American has been shot dead in Fremont, California, sending shock waves in the community. Rohit Sharma, who migrated to the US from Jalandhar along with his parents some seven year ago, was shot in the head while standing in a driveway of his apartment complex in Fremont, California on April 5, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X