వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్ఘనిస్తాన్‌లో వరుస పేలుళ్లు, పార్లమెంట్‌పై దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Afghanistan Map
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. వరుసగా పన్నెండు పేలుళ్లు జరిగాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ తదితర రాయాబార కార్యాలయాల ముందు బాంబు పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల అనంతరం ఉగ్రవాదులు కాల్పులు కూడా జరిపారు.

కాబుల్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లోనూ తీవ్రవాదాలు దాడులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు పైన దాడి జరిగింది. పార్లమెంటు భవనంలోకి చొచ్చుకు వెళ్లిన తీవ్రవాదాలు కాల్పులు జరిపి, రాకెట్లు ప్రయోగించారు. ఇది నగరంలోని ఉత్తర దిశలో ఉంది. దుండగులు హోటల్, రాయబార కార్యాలయాల పైన రాకెట్‌లు ప్రయోగించారు. ఒక్కసారిగా జరిగిన వరుస పేలుళ్లతో కాబుల్ వణికి పోయింది.

ఆప్ఘనిస్తాన్ పార్లమెంటు లక్ష్యంగా తీవ్రవాదులు ఈ దాడులు చేశారు. కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయం సురక్షితంగా ఉంది. మొదట తీవ్రవాదులు ప్రెసిడెన్షియల్ పక్కన ఉన్న స్టార్ హోటల్‌ను, ఇరానియన్ ఎంబసీని ముట్టడించి, వాటిని తమ వశం చేసుకొని బ్లాక్ స్మోక్‌ను పోయడం ప్రారంభించారని తెలుస్తోంది.

కాగా ఈ దాడులపై ఎంబసీలు అప్పుడే స్పందించేందుకు నిరాకరించాయి. దాడుల నేపథ్యంలో రాజధాని నగరం యొక్క భద్రతను పర్యవేక్షించే ఆఫ్ఘన్ భద్రతా దళాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి.

English summary
Gunmen launched multiple attacks in the Afghan capital, Kabul, on Sunday, with blasts and gunfire erupting in the heavily guarded, central diplomatic area and at the Afghan parliament in the west, witnesses and officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X