వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలైట్లు తగ్గారు, 8 జిల్లాలకే పరిమితం: కిరణ్ కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్లు తగ్గారని, కేవలం ఎనిమిది జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. న్యూఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో సోమవారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన అంతర్గత భద్రతపై జరిగిన సదస్సులో మాట్లాడారు. ఛత్తీస్‌గడ్, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లోనే నక్సలైట్లు ఎక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు.

ఏఓబీలో రక్షణ దళాలను తరలించేందుకు, ఏజెన్సీ ప్రాంతాల్లో గాయపడిన పోలీసులను తరలించడానికి వైజాక్ కేంద్రంగా ఓ హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. నక్సలైట్ల అణచివేతకు రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నామని ఆయన చెప్పారు. యువత ఉపాధి కోసం రాజీవ్ యువ కిరణాలు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.2400 కోట్లు కేటాయించాలని కిరణ్ కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు చురుగ్గా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించిందని చెబుతూ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలకు సహకారం అందించాలని కిరణ్ కోరారు. తీవ్రవాద నిరోధక చర్యల ఖర్చును ఎన్ఆర్ఈ నిధుల కిందకు తీసుకురావాలని కేంద్రాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఆ సదస్సుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గైర్హాజరు కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర వైఖరిపై ధ్వజమెత్తారు. కేంద్రం రాష్ట్రాల స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఎన్‌సిటిసి వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుదని ఆమె అభిప్రాయపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆమె కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
CM Kiran kumar Reddy said that naxalites are decreased in Andhra Pradesh. He said that the menace is high in Maharastra, Odisha and Cchattisgarh boarders. He appealed to Union Government for helicaptor to conter naxalites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X