హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీఫ్ ఫెస్టివల్: ఉస్మానియాలో విద్యార్థుల ఘర్షణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి అట్టుడికింది. ఈసారి తెలంగాణ ఉద్యమంపై కాదు, బీఫ్ ఫెస్టివల్‌పై. ఒక విద్యార్థులు నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ (పెద్దకూర పండుగ) ఆదివారం సాయంత్రం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ ఉత్సవాన్ని మరో వర్గం విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అయితే అర్ధరాత్రి వరకూ అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. విద్యార్థులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. విద్యార్థులు రెండు మీడియా వాహనాలకు నిప్పంటించారు.

ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఓయూ ఎన్ఆర్ఎస్ హాస్టల్ వద్ద బీఫ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు సాయంత్రం 4 గంటల నుంచే వివిధ హాస్టళ్ల నుంచి వి ద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. కొంచెంసేపు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవ ప్రత్యేకతను వివరించారు. అనంతరం విద్యార్థులు భోజనాలు మొదలుపెట్టారు. అదే సమయంలో ఓయూ బీ-హాస్టల్ వైపు నుంచి 200 మంది విద్యార్థులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఎన్ఆర్ఎస్ హాస్టల్ వైపు దూసుకొచ్చారు. విషయాన్ని గమనించిన పోలీసులు విద్యార్థులను ఓయూ స్విమ్మింగ్ పూల్ వద్ద అడ్డుకున్నారు. విద్యార్థులు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. బీఫ్‌ఫెస్టివల్ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అకస్మాత్తుగా పక్కనే ఉన్న న్యూపీజీ హాస్టల్ వైపుకు దూసుకెళ్లి భోజనం చేస్తున్న విద్యార్థులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఫెస్టివల్‌కు హాజరైన విద్యార్థులు రాళ్లతో ఎదురు దాడికి దిగారు. రెండు వర్గాలు అరగంట పాటు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాల విద్యార్థులు గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని గమనించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేం దుకు పది రౌండ్ల భాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడిపై దాడి గొడవంత సద్దుమణిగిన తర్వాత ఉస్మానియా యూనిర్సిటీ పరిశోధనా విద్యార్థి, తెలంగాణ విద్యార్శి వేదిక (టీవీవీ) నాయకుడు వెంకట్‌పై సి-హాస్టల్ వద్ద కొంత మంది విద్యార్థులు దా డి చేశారు. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంకట్‌ను చికిత్స ని మిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడింది ఏబీవీవాళ్లేనని, తాము నిర్వహిస్తున్న బీఫ్ ఫెస్టివల్‌ను మొదటి నుంచి వ్యతిరేకించింది, అడ్డుకున్నది కూ డా ఏబీవీపీ నాయకులేనని ఏఐఎస్ఎఫ్ నాయకుడు స్టాలిన్, పీడీఎస్‌యూ నాయకులు కోట రాజేశ్, ఆజాద్ ఆరోపించారు.

ఫెస్టివల్‌కు హాజరైన ప్రముఖులు ఓయూలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్‌కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అధ్యాపకుడు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్‌రావు, లా కళాశాల అధ్యాపకుడు డాక్టర్ గాలి వినోద్‌కుమార్, ఇప్లూ అధ్యాపకులు డాక్టర్ అలోషియస్, ప్రొఫెసర్ పార్ధసారథి, భాంగ్యాబుక్య, అంతర్జాతీయ దళిత రచయిత్రి మీనా కందస్వామి, పాండిచ్చేరి నుంచి ఫ్రెంచ్ అకడమిక్ సైంటిస్టు బ్రిగిట్, డాక్టర్ సెబస్టియన్ తదితరులు పెద్ద కూర పండుగలో పాల్గొన్నారు.

English summary

 Two groups of Osmania University have been clashed in Osmnia university of Hyderaabad. A group of students were organised beef festival, which was opoosed by another group in Osmania university.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X