హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దౌర్జన్యం, బెదిరింపులు: ఆదికేశవులు కొడుకు అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ భూవివాదంలో దౌర్జన్యానికి పాల్పడి ఆస్తి నష్టపర్చడమే కాకుండా బెదిరింపులకు పాల్పడిన ఘటనలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు తనయుడు శ్రీనివాస నాయుడును పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మేడ్చల్ పారిశ్రామిక వాడలోని సర్వే నంబర్ 806లోగల రెండెకరాల స్థలంలో ప్రసాద్ సీడ్స్‌కు చెందిన షెడ్డులు, కూలీల క్వార్టర్లు ఉన్నాయి.

ఈ స్థల వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. కాగా, కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ పొందిన శ్రీనివాస నాయుడు తన అనుచరులు, జెసిబి వాహనాలతో సోమవారం ఇక్కడకు చేరుకున్నారు. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

దీనిపై ప్రసాద్ సీడ్స్ మేనేజర్ మధుసూదన్‌ రావు ఫిర్యాదు చేయడంతో 447, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. కాగా, స్థలంపై సర్వహక్కులు తమకే ఉన్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని మధుసూదన్‌ రావు అంటున్నారు.

ఈ స్థలంపై వివాదం శ్రీనివాసులు నాయుడు, ఆ కంపెనీకి మధ్య వివాదం గత కొంతకాలంగా నడుస్తోంది. రంగారెడ్డి జిల్లా కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న శ్రీనివాస్ సోమవారం దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా ఇది జరిగింది. శ్రీనివాసులు నాయుడుని అరెస్టు చేసినట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు. శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరి పైనా కేసు నమోదైంది.

English summary
Medchal of Ranga Reddy district police arrest Tirumala Tirupati former chairman Adikeshavulu Naidu's son Srinivas Naidu on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X