వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చౌర్యం భారత విద్యార్థుల సమస్య: వికీపీడియా నివేదిక

By Pratap
|
Google Oneindia TeluguNews

 Wikipedia
న్యూఢిల్లీ: గ్రంథ చౌర్యం, కాపీరైట్ నిబంధనల ఉల్లంఘన భారత విద్యార్థులకు సంబంధించి పెద్ద సమస్య అని వికీపీడియా నివేదిక అభిప్రాయపడింది. వికీమీడియా ఫౌండేషన్‌ వికీపీడియా విద్యా కార్యక్రమంలో భాగమైన ఇండియా విద్యాకార్యక్రమం పూణే ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రామాణిక నివేదిక సిఫార్సులను, నిర్ధారణలను టోరీ రీడ్ స్టూడియో ప్రచురించింది.

ఫౌండేషన్ స్టాఫ్, కన్సల్టెంట్స్ పూణే పైలట్ ప్రాజెక్టును 2011 ఫిబ్రవరి, నవంబర్ మధ్య కాలంలో రూపొందించి అమలు చేసింది. పూణేలోని మూడు విశ్వవిద్యాలయాల్లోని 1,014 మంది విద్యార్థులను, 24 కోర్సులను ఈ ప్రాజెక్టు కోసం తీసుకుంది. వికీపీడియా బేసిక్స్‌ను విద్యార్థులకు చెప్పి అసైన్‌మెంట్ ఇవ్వడానికి ఫౌండేషన్ క్యాంపస్ అంబాసిడర్స్‌ను ఎంపిక చేసుకుంది. సెప్టెంబర్ నాటికి వికీపీడియాలో సమస్యాత్మకమైన కొత్త మెటిరీయల్ పెరిగింది. కాపీరైట్ నిబంధనల ఉల్లంఘన, పేరాల చౌర్యం, తప్పుడు కంటెంట్, భాషాపరమైన తప్పులు అవి.

గ్రంథాలకు సంబంధించి భారతదేశంలో కాపీరైట్, చౌర్యాలకు సంబంధించిన చట్టాలున్నాయని, అయితే సాధారణంగా అవి అమలు కావడం లేదని, చాలా మంది ఆచార్యులు కాపీ చేసి పేస్ట్ చేసే పద్ధతిని అంగీకరిస్తున్నారని నివేదిక అభిప్రాయపడింది. పూణే పైలట్ ప్రాజెక్టుకు ముందు కూడా ఆంగ్లంలో కాపీ రైట్ నిబంధనలను ఉల్లంఘించిన కంటెంట్ కనిపించిందని గ్లోబల్ వికీపీడియా సంపాదకులు అభిప్రాయపడ్డారు. దీనిపట్ల తాము పరిగణనలోకి గత కొన్నేళ్లుగా తీసుకున్నట్లు వికీపీడియా ఆర్బిట్రేటర్ చెప్పినట్లు ఓ వార్తాకథనం తెలిపింది.

దాని గురించి వివరంగా చెప్పినప్పటికీ కొద్ది మంది విద్యార్థులు మాత్రమే వికీపీడియా కాపీ రైట్, చౌర్యం నిబంధనలను అర్థం చేసుకోగలిగారని వ్యాఖ్యానించింది. దాంతో పైలట్ ప్రాజెక్టుకు చెందిన విద్యార్థుల్లో 266 మంది మాత్రమే మిగిలారని చెప్పింది.

English summary
Wikipedia has published report by Tory Read Studio that presented findings and recommendations from a qualitative review of the India Education Program Pune Pilot Project, which is part of the Wikimedia Foundation’s Wikipedia Education Program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X