వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీడి వివాదం: పార్టీ బ్రీఫింగ్స్ నుంచి సింఘ్వీ అవుట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Abhishek Singhvi
న్యూఢిల్లీ: సిడి వివాదంలో ఇరుక్కున్న కాంగ్రెసు ముఖ్య అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీని పార్టీ బ్రీఫింగ్స్‌ నుంచి పార్టీ నాయకత్వం తప్పించింది. ప్రతి సోమవారం ఆయన పార్టీ బ్రీఫింగ్స్‌ను మీడియాకు ఆయన ఇస్తారు. అయితే ఈ వారం ఆయనను దూరంగా ఉంచారు. సోమవారం బ్రీఫింగ్‌కు సింఘ్వీ అందుబాటులో ఉండరని, ఇంత మేరకు మాత్రమే తాము చెప్పగలనని కాంగ్రెసు వర్గాలు అంటున్నాయి.

సీడి వివాదంలో చిక్కుకోవడం వల్లనే సింఘ్వీని మీడియా బ్రీఫింగ్స్ నుంచి తప్పించారా అని అడిగితే ఈ సోమవారం సింఘ్వీ అందుబాటులో ఉండరని, అంతకు మించి చెప్పలేమని కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి. పతన చుట్టూ చెలరేగుతున్న వివాదాలకు స్వస్తి చెప్పాలని ప్రతి సోమవారం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చే సింఘ్వీ అన్నారు.

మీడియా బ్రీఫింగ్ వద్దని తనకు సోమవారం ఉదయం చెప్పారని ఆయన అన్నారు. ప్రముఖ న్యాయవాది కూడా అయిన సింఘ్వీకి సంబంధించిన సీడి వివరాలను ప్రచురించకూడదని, ప్రసారం చేయకూడదని ఢిల్లీ హైకోర్టు మీడియా సంస్థలను ఆదేశించింది.

సిడీని తారుమారు చేశారని, మార్ఫింగ్ చేశారని సింఘ్వీ ఆరోపిస్తున్నారు. ఆ సిడీలోని విషయాలను ప్రసారం చేస్తే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆయన హైకోర్టుకు చెప్పుకున్నారు. తన హక్కును దెబ్బ తీయడమే అవుతుందని ఆయన అన్నారు. దీంతో సిడిలోని విషయాలను ప్రచురించడం గానీ ప్రసారం చేయడం గానీ చేయకూడదని హైకోర్టు ఆదేశాలిచ్చింది. సోమవారం తనకు కాస్తా అస్వస్థత ఉందని సింఘ్వీ చెప్పారు.

English summary
Amid reports about a CD involving him, Congress spokesman Abhishek Singhvi has kept away from party briefings this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X