హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొడలు కొట్టి చతికిల: నేతలపై పరిపూర్ణానందజీ చురక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Swami Paripoornananda Saraswati
హైదరాబాద్: శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ బుధవారం తన ప్రవచనంలో నాయకులకు చురకలు వేశారు. తొడ ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకూడదని సూచించారు. స్వామీజీ ఇందిరాపార్కు పక్కన ఎన్టీఆర్ స్టేడియంలో లలితా సహస్రనామ రహస్యంపై ప్రవచనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యలో నేతలపై చలోక్తి విసిరారు. వీర్యానికి సంకేతమైన తొడ ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకూడదన్నారు.

దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయిలు ఎప్పుడూ తొడలు కొట్టలేదన్నారు. అందుకే వారు గొప్ప నాయకులుగా మిగిలి పోయారని పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు తొడలు కొడుతూ చతికిల పడుతున్నారని చురక వేశారు. కాగా ఆయన శ్రీమతి అంటే పురుషుడు శ్రీ అంటే స్త్రీ అని కొత్త నిర్వచనం చెప్పారు.

మానవుడు ఈర్ష్యా ద్వేషాల నుంచి బయటపడాలంటే దైవనామస్మరణ ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు. ఈశ్వరుడు సృష్టించిన ప్రకృతిపై ఏనాడు ఎవ్వరికీ విరక్తి కలుగదని చెప్పారు. మానవుడు సృష్టించిన వస్తువుల పైన మాత్రం తప్పక విరక్తి కలుగుతుందన్నారు. అమ్మ ప్రభావాన్ని వెయ్యి నామాలలో వల్లించారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కాగా శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ ప్రవచనాలు ఎన్టీఆర్ స్టేడియంలో ఏప్రిల్ 6వ తారీఖు నుండి ప్రారంభమయ్యాయి. మే 10వ తేది వరకు ఆయన లలితా సహస్ర నామములలోని రహస్యంపై ప్రవచనాలు ఇస్తారు. ఆయన ప్రవచనాలకు భక్తుల నుండి మంచి స్పందన లభిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తులు ఆయన ప్రవచనాలకు హాజరవుతున్నారు. కాగా టిటిడి నిర్వహిస్తోన్న ఎస్‌విబిసి ఛానల్‌లో స్వామీజీ ప్రతి రోజు ఉదయం 7-00 గంటల నుండి 7.30 గంటల వరకు భగవద్గీతను చెబుతున్నారు.

English summary
Swami Paripoornananda Saraswati commented political leaders in his pravachanams at NTR staduim. He is giving pravachanams about Lalitha Sahasranamam secret in Hyderabad. It was started on 6th of April and end on 10th of May.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X