వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్ని-5 ప్రయోగం సక్సెస్: సైన్యం చేతికి త్వరలో అస్త్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Agni-V
న్యూఢిల్లీ: భారత సైన్యం చేతికి మరో రెండేళ్లలో మరో అద్భుతాస్త్రం రానుంది. భారత్ తొలిసారిగా ఖండాంతర క్షిపణి అగ్ని 5ని ఒడిషాలోని వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు ఈ ప్రయోగం జరిగింది. అగ్ని 5 క్షిపణి లక్ష్యం వైపు విజయవంతంగా దూసుకు వెళుతోంది. అగ్ని 5 ప్రయోగంతో ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థ ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరినట్లయింది.

ఇప్పటి వరకు యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, యుకే మాత్రమే ఇందులో ఉన్నాయి. అలాగే దేశ అమ్ముల పొదిలో అగ్ని ఓ కీలక ఆయుధం కానుంది. అంతేకాకుండా అగ్ని ప్రయోగంతో అంతర్జాతీయ రక్షణ వ్యవస్థల తీరు తెన్నులు కొత్తపుంతలు తొక్కే అవకాశముంది. ఈ ప్రయోగాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. అబ్బురపరిచే అదనపు శక్తులు ఉన్న ఈ క్షిపణి ప్రయోగంపై సహజంగానే భారత్‌కు అనుకూల, వ్యతిరేక దేశాలు దృష్టి సారించాయి.

రక్షణ, అంతరిక్ష రంగాలతో పాటు మరికొన్ని కీలక రంగాలకు చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టు కోసం కఠోరంగా శ్రమించారు. నిర్ధేషించిన లక్ష్యాలపై పడి విధ్వంసం సృష్టించడం ఒక్కటే కాకుండా భారతదేశ రక్షణ అవసరాలకు తగ్గట్లుగా బహుముఖ సేవలను అందించగల అస్త్రంగా అగ్నిని శాస్త్రవేత్తలు మలిచారు.

సుమారు యాభై టన్నుల బరువు, పదిహేడు మీటర్ల పొడవు ఉండే అగ్ని 5 క్షిపణి ఒక టన్ను బరువైన అణ్వస్త్రాలను మోసుకుపోతూ ఐదువేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఇది బుధవారమే ప్రయోగించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించలేదు. అగ్ని క్షిపణిల్లో ఐదో సిరీస్ కూడా విజయవంతం కావడంతో భారత రక్షణ వ్యవస్థలో మరో కలికితురాయి చేరింది.

English summary
India on Thursday test-fired for the first time its most-ambitious strategic missile, the over 5,000-km range Agni-V, in a bid to join the super exclusive ICBM (intercontinental ballistic missile) club that counts just US, Russia,China, France and UK as its members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X