హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫస్టియర్‌లో బాలికల హవా: ఫస్ట్ కృష్ణ, పాలమూరు లాస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Intermediate Results
హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో బాలికలదే పై చేయి. శుక్రవారం ఉదయం మంత్రి పార్థసారథి ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 8,50,433 మంది మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించిన వారు 4,57,146 విద్యార్థులు. ఉత్తీర్ణత శాతం 53.75గా ఉంది. ఎ గ్రేడ్‌లో 89,479, బి గ్రేడ్‌లో 47,248 మంది విద్యార్థులు పాసయ్యారు.

బాలుర ఉత్తీర్ణత శాతం 49.73 ఉండగా, బాలికల ఉత్తీర్ణత శాతం 58.32గా ఉంది. కృష్ణా జిల్లా 71 శాతంతో మొదటి స్థానంలో ఉండగా 37 శాతంతో మహబూబ్‌నగర్ జిల్లా(పాలమూరు) ఆఖరు స్థానంలో ఉంది. విశాఖపట్నం జిల్లా 65 శాతంతో రెండో స్థానంలో ఉంది. గతంలో కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత మూడేళ్లుగా ఏటికేడు ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. గత సంవత్సరంతో పోలీస్తే 1.53 శాతం ఉత్తీర్ణత ఈ సంవత్సరం పెరిగింది.

ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే అదిలాబాద్ 76.02 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, అనంతపురం 29.49తో ఆఖరు స్థానంలో నిలిచింది. గ్రేడ్‌ల వారీగా ఉత్తీర్ణత శాతం విషయానికి వస్తే.. ఏ గ్రేడ్ - 41.45 బి గ్రేడ్ - 32.21 సి గ్రేడ్ - 18.18 డి గ్రేడ్ - 8.16గా ఉంది.

వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత మాత్రం గతంలో కంటే తగ్గింది. వృత్తి విద్యలో 33 శాతం ఉత్తీర్ణత ఉంది. వొకేషనల్‌లో నల్గొండ జిల్లా 45 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, నిజామాబ్ద్, మహబూబ్‌నగర్ 18 శాతంతో ఆఖరు స్థానంలో ఉన్నాయి.

English summary
Minister Partha Sarathi released Intermediate first year results in Hyderbad on friday morning. Krishna district in first place with 71 percent and Mahaboobnagar district in lost place with 37 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X