విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి నట్టేట ముంచాడు: రోజా, సారయ్యపై గోనె ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja
విశాఖపట్నం/హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి పదవుల కోసమే తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, నటి రోజా విమర్శించారు. పార్టీని రెండేళ్లు కూడా నడపలేక తనను నమ్ముకున్న వారిని చిరంజీవి నట్టేట ముంచారని మండిపడ్డారు. తిరుపతి ప్రచారంలో చిరంజీవిని తరిమి తరిమి కొడతారని రోజా చెప్పారు.

తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆమె చెప్పారు. ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రోజా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిరంజీవిపై మండిపడ్డారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రులు బస్వరాజు సారయ్య, కొండ్రు మురళీ మోహన్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు శుక్రవారం ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం సభ పెడతానని సారయ్య చెబితే వైయస్ బెదిరించారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.

సారయ్య, కొండ్రు తమ స్వార్థం కోసమే వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ ఆడిస్తున్న నాటకంలో ఓ భాగమే సారయ్య వ్యాఖ్యలు అన్నారు.

1989లో పార్టీ అభ్యర్థి ఓటమికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిగిన చరిత్ర బస్వరాజు సారయ్యది అని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు వైయస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. మంత్రులు జానా రెడ్డి, చిన్నారెడ్డి, బస్వరాజు సారయ్యలు పదవుల కోసం తెలంగాణను తాకట్టు పెడ్డారని దుయ్యబట్టారు. కాగా తాను తెలంగాణ కోసం సభను పెడతానంటే వైయస్ రాజశేఖర రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వనని ఫోన్లో బెదిరించారని బస్వరాజు సారయ్య గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

English summary
YSR Congress party woman leader and cine actor Roja blamed Rajya Sabha member Chiranjeevi today. She said Chiranjeevi dumped Prajarajyam Party leaders in water with merge his party in Congress. YSRC leader Gone Prakash Rao fired at ministers Baswaraj Saraiah and Kondur Murali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X